రెండు వారాల్లో పుతిన్‌ను కలుస్తానని ఆశిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. గురువారం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే రెండు వారాల్లో హంగేరీలోని బుడాపెస్ట్‌లో పుతిన్‌ను కలవాలని భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
పుతిన్‌తో టెలిఫోన్ సంభాషణ చేసినట్లు తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు పుతిన్‌ను కలుస్తున్నట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్ నెట్‌వర్క్‌లో రాసుకొచ్చారు. రెండు వారాల్లోపు.. చాలా త్వరగా కలుస్తానని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో త్వరలో రష్యా విదేశాంగ కార్యదర్శి సెర్గీ లావ్‌రోవ్‌తో సమావేశమై శిఖరాగ్ర సమావేశ వివరాలను చర్చిస్తారని ట్రంప్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Bengaluru: బెంగళూరులో దారుణం.. బి.ఫార్మ్ విద్యార్థిని గొంతుకోసి చంపిన యువకుడు
ట్రంప్-పుతిన్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని హంగేరీ ప్రధానమంత్రి విక్టర్ ఓర్బన్ తెలిపారు. అమెరికా-రష్యా శాంతి శిఖరాగ్ర సమావేశానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఎక్స్‌లో విక్టర్ ఓర్బన్ తెలిపారు.
ఉక్రెయిన్‌కు టోమాహాక్ క్షిపణులు అందిస్తామని అమెరికా ప్రకటించింది. ఈ క్షిపణులు 1,000-మైళ్ల (1,600 కిలోమీటర్ల) పరిధిలో పని చేయగల క్షిపణులు. ఓ వైపు శాంతి చర్చలకు దిగుతున్న సమయంలో టోమాహాక్ క్షిపణులు అందిస్తామన్న అమెరికా ప్రకటనను క్రెమ్లిన్ తప్పుపట్టింది. మరోవైపు పుతిన్-ట్రంప్ సమావేశాన్ని క్రెమ్లిన్ ప్రశంసించింది. అత్యంత ముఖ్యమైన సమావేశంగా పేర్కొంది.
ఇది కూడా చదవండి: Kriti Sanon: తొలి భారతీయ మహిళా నటిగా ‘కృతి సనన్’ చరిత్ర!
ఇటీవల అలాస్కా వేదికగా పుతిన్‌తో ట్రంప్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా యుద్ధం ముగింపుపై చర్చలు జరిపారు. కానీ సత్‌ఫలితాన్ని ఇవ్వలేదు. మరోసారి హంగేరీ వేదికగా ట్రంప్-పుతిన్ కలవనున్నారు. ఈ సమావేశం తర్వాతైనా చర్చలు కొలిక్కి వస్తాయేమో చూడాలి.
