Donald Trump: ‘‘బిడ్డను కనడానికే వస్తారు’’.. భారతీయులపై ట్రంప్ అక్కసు..
- భారతీయులపై ట్రంప్ అక్కసు..
- బిడ్డను కనడానికే వస్తారంటూ జాత్యాహంకార వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై ఉన్న తన అక్కసును మరోసారి బయటపెట్టారు. అమెరికన్ పొలిటికల్ వ్యాఖ్యాత, రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ భారతీయులు, చైనీయులపై జాత్యాంహకార వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని ట్రంప్ సమర్థిస్తూ రీపోస్ట్ చేశారు. భారత్, చైనా ఇతర దేశాలను ‘‘నరకాలు’’గా అభివర్ణించారు. అమెరికాలో పుట్టుక ద్వారా వచ్చే జన్మహక్కు పౌరసత్వ చట్టంలో మార్పులు తీసుకురావాలని సావెజ్ కోరారు. ఈ రెండు దేశాల ఆసియా ప్రజలు తొమ్మిదవ నెలలో బిడ్డను కనడానికి అమెరికాకు వస్తారని ఆరోపించారు.
Read Also: OMG: ఆడుకుంటూ గంగాళంలో ఇరుక్కున్న చిన్నారి.. చివరి ప్రయత్నంలో ఇలా..
Also Read
అమెరికా జన్మహక్కు పౌరసత్వంపై సుప్రీంకోర్టు వాదనల్ని సావేజ్ తీవ్రంగా విమర్శిస్తూ, చట్టంలో మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అమెరికాలో జన్మహక్కు పౌరసత్వం ద్వారా ఇక్కడ ఒక బిడ్డ అమెరికన్ పౌరుడిగా మారుతారని, ఆ తర్వాత చైనా, భారత్ ఇతర నరకూపాల నుంచి వారి మొత్తం కుటుంబాన్ని అమెరికాకు తీసుకువస్తారని బలుపు మాటలు మాట్లాడాడు. భారత్, చైనా వలసదారుల్ని ‘‘ల్యాప్ టాప్ కలిగిన గ్యాంగ్స్టర్లు’’గా అభివర్ణించారు. మాఫియా కుటుంబాలు ఈ దేశానికి చేసిన నష్టాని కన్నా వీరే ఈ దేశానికి ఎక్కువ నష్టం చేస్తారని ఆరోపించారు. భారతీయుల వల్ల అమెరికాలోని ప్రజలకు అవకాశాలు తగ్గాయని అన్నారు.
అయితే, సావేజ్ పోస్టునే ట్రంప్ రీపోస్ట్ చేశారు. ట్రంప్ సీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికా తప్ప ప్రపంచంలో ఏ దేశం కూడా బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఇవ్వదని అప్పుగా చెప్పారు. నిజానికి మెక్సికో, కెనడా వంటి అనేక దేశాలు ఇలా పౌరసత్వాన్ని ఇస్తున్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా వీసా విధానాన్ని మార్చాలని కోరుకుంటున్నారు. ఈమేరకు ఆటోమేటిక్ పౌరసత్వాన్ని నిలిపివేయడానికి ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను కూడా జారీ చేశాడు. అయితే, అమెరికా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం.. జన్మహక్కు పౌరసత్వం హామీ ఉంటుందని అమెరికన్ న్యాయనిపుణులు చెబుతున్నారు. దీనిపై అక్కడి సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Story Board: పుత్తడి అమ్మకాలు ఎందుకు తగ్గాయి..? ఆర్థిక పరిస్థితులే కారణమా..?
-
Neetu Bhai : కిరాణా షాపులో గంజాయి దందా.. లేడీ డ్రగ్ డాన్ అడ్డా నేలమట్టం.!
-
Off The Record: శృంగవరపు కోట TDPలో గ్రూప్ వార్!
-
UP: అమిత్ షాతో ఎస్పీ ఎంపీ భేటీ!.. అఖిలేష్ యాదవ్‌కు భారీ ఝలక్ తప్పదా?
-
kitchen tips: చపాతీ కర్రకు బూజు పడుతోందా? ఈ చిన్న ట్రిక్‌తో ఫంగస్‌కు చెక్ పెట్టండి!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!