అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అధిక సుంకాలతో ఇప్పటికే ప్రపంచ మార్కెట్లు కుదేల్ అయిపోతున్నాయి. వ్యవస్థలన్నీ అతలాకుతలం అయిపోతున్నాయి. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇలా ప్రపంచ దేశాలన్నీ తీవ్ర సతమతం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ట్రంప్ మరోసారి చైనాకు బిగ్ షాకిచ్చారు.
ఇక ట్రంప్ సుంకాలు ప్రకటించగానే.. చైనా మాత్రం అమెరికాపై ఎదురుదాడికి దిగింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే వాటిపై అదనంగా 34 శాతం సుంకాలను పెంచేసింది. ఈ వ్యవహారంపై ట్రంప్ స్పందిస్తూ.. చైనా భయపడిందని.. తక్షణమే సుంకాలను తగ్గించకపోతే.. ప్రతిదాడి తప్పదని ట్రంప్ హెచ్చరించారు. అన్నట్టుగానే ట్రంప్ భారీగా సుంకాలు పెంచేశారు. ఏకంగా 104 శాతం టారిఫ్‌లు పెంచేశారు. పెంచిన టారిఫ్‌లు వెంటనే అమల్లోకి వస్తాయని వైట్‌హౌస్ ప్రకటించింది. ఈ దెబ్బతో ప్రపంచ మార్కెట్లు అల్లకల్లోలం కావడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Ramagiri SI: ఊడదీయడానికి యూనిఫాం అరటితొక్క కాదు
ట్రంప్ హెచ్చరికలపై చైనా స్పందించింది. ప్రతీకార చర్యను ఉపసంహరించుకోవాలని కోరింది. ట్రంప్ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని పేర్కొంది. సుంకాలు తగ్గించేంత వరకు చైనా పోరాడుతుందని తెలిపింది.
ఇదిలా ఉంటే చైనాపై పెంచిన సుంకాలు తగ్గించాలని ట్రంప్ సలహాదారుడు ఎలోన్ మస్క్ ఒత్తిడి చేశాడు. కానీ అందుకు ట్రంప్ అంగీకరించలేదని తెలుస్తోంది. స్వయంగా ట్రంప్‌తో చర్చలు జరిపినా ప్రయోజనం దక్కలేదు. మొత్తానికి చైనాకు ట్రంప్ చుక్కలు చూపిస్తున్నారు. తాజా పెంపుతో నేటి మార్కెట్లు మరింతగా పతనం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Mujra Party: మొయినాబాద్‌లో ముజ్రా పార్టీ భగ్నం.. ఏడుగురు అమ్మాయిలతో..!
