Donald Trump: చమురు ధరలపై ట్రంప్ సంచలన ప్రకటన.. 2 డాలర్ల దిగువకు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చమురు ధరలపై సంచలన అంచనాలు వేస్తున్నారు.. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో డొనాల్డ్ ట్రంప్ మాత్రం యుద్ధంలో అమెరికా విజయం సాధించిన తర్వాత చమురు ధరలు వేగంగా పడిపోతాయని అంచనా వేశారు. గ్యాసోలిన్ ధరలు చివరికి గ్యాలన్‌కు 2 డాలర్ల కంటే దిగువకు చేరవచ్చని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్టులో.. ఇరాన్‌తో యుద్ధం ముగిసి అమెరికా విజయం సాధించిన వెంటనే చమురు ధరలు భారీగా తగ్గుతాయని అన్నారు. మొదట గ్యాలన్‌కు 3 డాలర్లకు, ఆ తర్వాత 2 డాలర్ల కంటే తక్కువకు ధరలు పడిపోతాయని పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాన్ని పొందకుండా అమెరికా అడ్డుకుంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు.
భారీగా పెరిగిన అంతర్జాతీయ చమురు ధరలు
అమెరికా, ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు పెరగడంతో సోమవారం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు దాదాపు 97 డాలర్లకు చేరింది. గత ఐదు రోజుల్లో ఇది సుమారు 9 శాతం, గత నెలలో దాదాపు 19 శాతం పెరిగింది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి చుట్టూ జరుగుతున్న పరిణామాలు ప్రపంచ చమురు సరఫరాపై ఆందోళనలను పెంచుతున్నాయి. ప్రపంచంలో శాంతి సమయాల్లో రవాణా అయ్యే చమురులో దాదాపు ఐదో వంతు హార్ముజ్ జలసంధి మీదుగా వెళ్తుంది. దీంతో ఈ ప్రాంతంలో సైనిక ఘర్షణలు మరింత తీవ్రతరం అయితే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా, ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
Also Read
- Saudi Arabia: మసీదులో ముద్దు పెట్టుకుంటే మరణశిక్షనా.? సౌదీ శిక్షపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం..
- Kenya Cult: ‘‘ఏసుక్రీస్తును కలుస్తారని ఉపవాసం’’.. 191 మంది హత్యల కేసులో దోషిగా పాల్ మెకెంజీ..
- Kim Jong Un Death Rumors: కిమ్ జోంగ్ ఉన్ మృతిపై పుకార్లు.. కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
- Sheikh Hasina: ‘చంపినా, అరెస్టు చేసినా వెనక్కి తగ్గను’.. బంగ్లాదేశ్‌కు వెళ్తానన్న హసీనా
ఇరాన్ హెచ్చరిక
ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ గలీబాఫ్ అమెరికాను హెచ్చరించారు. ఇరాన్‌కు చెందిన చమురు, గ్యాస్ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. తమ ఇంధన ఆస్తులపై దాడి జరిగితే ప్రతీకారం తప్పదని స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా అధికారులు ఇరాన్ చమురు ట్యాంకర్ నౌకాదళం బలహీనంగా ఉందని పేర్కొన్నారు. ఇరాన్ నుంచి అమెరికా నౌకలపై దాడులు జరిగితే చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.
యుద్ధం ముగిస్తే ధరలు తగ్గుతాయా?
ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ చమురు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. హార్ముజ్ జలసంధి వద్ద పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చి, చమురు సరఫరాలో అంతరాయాలు తగ్గితే ధరలు తగ్గే అవకాశం ఉంది. అయితే ట్రంప్ చెప్పినట్లుగా గ్యాసోలిన్ ధరలు 2 డాలర్ల కంటే దిగువకు వస్తాయా అనేది యుద్ధ పరిస్థితులు, ప్రపంచ డిమాండ్, సరఫరా వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
తాజావార్తలు
-
Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
-
CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
ట్రెండింగ్
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..