Trump-Sanae Takaichi: ట్రంప్‌తో జపాన్ ప్రధాని భేటీ.. షాకింగ్ ప్రశ్నకు అసౌకర్యానికి గురైన సనాయే తకైచి
- ట్రంప్‌తో జపాన్ ప్రధాని భేటీ
- ఇరాన్ యుద్ధ సమయంలో తొలి భేటీ
- షాకింగ్ ప్రశ్నకు అసౌకర్యానికి గురైన సనాయే తకైచి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో భీకర స్థాయిలో యుద్ధం జరుగుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేయడంతో మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ద్వైపాక్షిక చర్చల కోసం జపాన్ ప్రధాని సనాయే తకైచి వైట్‌హౌస్‌కు వచ్చారు. ట్రంప్‌తో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అనంతరం ఓవల్ కార్యాలయంలో జరిగిన ప్రెస్మీట్లో ఎదురైన ప్రశ్నతో ఒక్కసారిగా సనాయే తకైచి ఉక్కిరి బిక్కిరికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైట్‌హౌస్‌లో గురువారం ట్రంప్‌తో జపాన్ ప్రధాని సనాయే తకైచి సమావేశం అయ్యారు. అనంతరం ఇద్దరూ కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. తొలుత ట్రంప్-తకైచి మధ్య సరదా సన్నివేశం ప్రారంభమైంది. తకైచికి ఇంగ్లీష్ బాగా వచ్చని ప్రశ్నించారు. అనువాదం అవసరమే లేదని సరదాగా వ్యాఖ్యానించారు. అనువాదం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకపోవడం మంచి విషయంగా పేర్కొన్నారు. ఇక ‘‘వచ్చేసారి మీ భాష (జపనీస్) నేర్చుకుని వస్తాను.’’ అని సరదాగా ట్రంప్ తెలిపారు.
Also Read
- China: కొత్త గేమ్‌కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
- Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్‌పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్‌కు స్పష్టమైన సందేశం..
- Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
ఇలా సరదాగా సాగుతున్న సమావేశం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. జపనీస్‌కు చెందిన ఒక విలేఖరి ట్రంప్‌తో మాట్లాడుతూ.. ‘‘మీరు ఇరాన్‌పై దాడి చేయడానికి ముందే మాకు ఎందుకు చెప్పలేదు?.’’ అని అడిగాడు. ఆ ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ.. ‘‘మేము ఆశ్చర్యపరచాలనుకున్నందుకే ఎవరికీ చెప్పలేదు. అయినా ఆశ్చర్యాల గురించి జపాన్ కంటే బాగా ఎవరికి తెలుసు ?.’’ అని వ్యాఖ్యానించారు. వెంటనే తకైచి వైపు తిరిగి.. ‘‘పెర్ల్ హార్బర్ గురించి మీరు నాకు ఎందుకు చెప్పలేదు?.’’ అని నిలదీశారు. ట్రంప్ వ్యాఖ్యతో సనాయే తకైచి అసౌకర్యానికి గురైనట్లు కనిపించారు. దానికి బదులివ్వకుండా మౌనంగా ఉండిపోయారు. బహుశా సనాయే తకైచికి బదులుగా అనువాదకురాలి మాట్లాడుతున్నందున స్పందించలేనట్లుగా కనిపించింది.
పెర్ల్ హార్బర్…
1941 డిసెంబర్ 7(ఆదివారం)న పెర్ల్ హార్బర్‌పై జపాన్ దాడి చేయడంతో ఈ ఘటనలో 2,400 మందికి పైగా అమెరికన్ సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా అనేక యుద్ధ విమానాలు, నౌకలు ధ్వంసమయ్యాయి. దాదాపు 20 నౌకలు, 300కు పైగా విమానాలు నాశనం అయ్యాయి. ఈ సంఘటనతో మరుసటి రోజే అమెరికా రెండో ప్రపంచం యుద్ధంలోకి దిగింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై అణు బాంబులను వేశాయి. చరిత్రలో అణ్వాయుధాలను ఉపయోగించడం ఇదే ఏకైక సంఘటనగా భావిస్తారు. అణ్వాయుధాలు కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ చరిత్ర గుర్తుచేసుకునప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు.
ఇదిలా ఉంటే గత నెల 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యాడు. దీంతో ఇరాన్ ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ఇలాంటి సంఘర్షణల మధ్య వైట్‌హౌస్‌లో తొలిసారి ట్రంప్‌ను కలిసిన ప్రపంచ నేతల్లో సనాయే తకైచినే కావడం విశేషం.
ఇది కూడా చదవండి: Stock Market: హమ్మయ్య.. తేరుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!