Site icon NTV Telugu

Trump: ఆ రెండు దేశాలు పోట్లాడుకోవడం ఇష్టం లేదు

Trump2

Trump2

ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మాట్లాడుతూ.. ఆ రెండు దేశాలు యుద్ధం ఆపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇరు దేశాలు పదే పదే బాంబులు వేసుకోవడం ఏ మాత్రం ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. శాంతి ఒప్పందం కోసం రష్యాతో మాట్లాడుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే యుద్ధం ఆపాలని విజ్ఞప్తి చేశామన్నారు. అయినా కూడా బాంబు దాడులు ఆగలేదన్నారు. నిరంతరం దాడులు చేసుకోవడం.. ప్రతి వారం వేలాది మంది యువకులు చంపబడటం ఏ మాత్రం ఇష్టం లేదని ట్రంప్ చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Vontimitta: ఒంటిమిట్టకు మంత్రుల బృందం..

ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చాక.. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఇందుకోసం సౌదీ అరేబియాలో రష్యాతో అమెరికా అధికారులు చర్చలు కూడా జరిపారు. కానీ ఏ మాత్రం సత్‌ఫలితాలు ఇవ్వలేదు. అంతేకాకుండా స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కూడా ట్రంప్ గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడారు. అయినా ప్రయోజనం లభించలేదు. పుతిన్ పలు షరతులు విధించారు. అంతేకాకుండా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పదవి నుంచి దిగిపోతేనే శాంతి చర్చలు జరుపుతామని పుతిన్ తెగేసి చెప్పారు. ఈ వ్యవహారమే అడ్డంకిగా మారింది. ఈ వ్యాఖ్యలు ట్రంప్‌కు కూడా కోపాన్ని తెప్పించాయి. తన గురించి పుతిన్‌కి తెలుసని.. ఈ వ్యాఖ్యలు కరెక్ట్ కాదని.. తనకు కోపం తెప్పించొద్దని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఓ వైపు శాంతి చర్చలు జరుగుతుండగానే ఇరు దేశాలు బాంబు దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుందో చూడాలి.

ఇది కూడా చదవండి: Hyderabad: నడిరోడ్డులో గర్భవతి భార్యపై బండరాయితో దాడి చేసిన భర్త

 

Exit mobile version