Donald Trump: ‘‘ఆయన భార్య దారుణం, చెంపపై ఇంకా వాపు ఉంది’’.. మక్రాన్‌పై ట్రంప్ సెటైర్లు..
- ఆయన భార్య దారుణంగా ప్రవర్తిస్తుంది, చెంపపై వాపు పోలేదు..
- ఫ్రెంచ్ అధ్యక్షుడు మక్రాన్‌పై ట్రంప్ వ్యక్తిగత విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: ఇరాన్ యుద్ధంలో నాటో దేశాలు, యూరప్‌లోని మిత్రదేశాలు అమెరికాతో కలిసి రావడం లేదు. దీంతో యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యూకే ప్రధాని కీర్ స్టార్మర్ మాట్లాడుతూ.. ఈ యుద్ధంతో తమకు సంబంధం లేదని చెప్పారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మన్యుయేల్ మక్రాన్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో ట్రంప్.. అమెరికా నాటో కూటమి నుంచి బయటకు వచ్చే ఆలోచన చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ యుద్ధం కోసం నాటో ఏర్పడలేదని యూరప్ దేశాలు ట్రంప్‌కు కౌంటర్ ఇస్తున్నాయి.
ఇప్పుడు ట్రంప్ ఈ దేశాధినేతలపై నేరుగా వ్యక్తిగత దాడికి దిగారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్ గురించి మాట్లాడుతూ.. ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మక్రాన్, ఆయన భార్య బ్రిగెట్టి మక్రాన్‌లను ఎగతాళి చేశారు. మక్రాన్ ‘‘ఆ దెబ్బ నుంచి ఇంకా కోలుకుంటున్నారని’’ ట్రంప్ అన్నారు. అతడి భార్య అతడితో దారుణంగా ప్రవర్తిస్తుందని చెప్పారు. ‘‘నేను మక్రాన్‌కు ఫోన్ చేశా. అతడి భార్య అతడితో దారుణంగా ప్రవర్తిస్తుంది. అతను ఇంకా చెంపదెబ్బ నుంచి కొలుకుంటున్నాడు.’’ అని ట్రంప్ అన్నారు.
Also Read
- Melania Trump: అమెరికా అధ్యక్షుడి భార్య ఎక్కడ? నెల రోజులుగా కనిపించని మెలానియా ట్రంప్!
- Economic D-Day: ఇరాన్‌కు ఆర్థిక సాయం చేస్తే భారీ మూల్యం తప్పదు.. దేశాలకు ట్రంప్ ‘ఎకనామిక్ డీ-డే’ హెచ్చరిక
- Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
- Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
వియత్నాం పర్యటనలో బ్రిగెట్టి మక్రాన్‌ను కొట్టిందా?
వియత్నాం పర్యటన సమయంలో విమానం నుంచి దిగుతున్న మక్రాన్‌ను బ్రిగెట్టి ముఖంపై చేయి చేసుకున్నట్లు చూపించే వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఈ వీడియోను ప్రస్తావిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. మే 2025 నాడు ఈ ఘటన జరిగింది. అయితే, ఈ ఆరోపణల్ని మక్రాన్ తోసిపుచ్చారు. తన స్కూల్ టీచర్, తన కన్నా పెద్దదైన, వివాహమై అప్పటికే పిల్లలు ఉన్న బ్రిగెట్టిని మక్రాన్ లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు.
'Then I call up Macron, whose wife treats him EXTREMELY BADLY' — Trump
'He’s still recovering from the RIGHT to the JAW'
Puts on accent as he describes his call with French Prez https://t.co/ZAG8H3NYB6 pic.twitter.com/KJK2NG6w2u
— RT (@RT_com) April 1, 2026
❗️ Macron's wife viciously SMACKS him in face pic.twitter.com/2zSalRFYLu
— RT (@RT_com) May 26, 2025
తాజావార్తలు
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Sai Abhyankkar: ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
-
Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు… క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
-
Volvo EX90: LiDAR సేఫ్టీతో వస్తున్న లగ్జరీ ఎలక్ట్రిక్ SUV వోల్వో EX90.. 600KM రేంజ్..!
-
Ongole: లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!