Site icon NTV Telugu

Donald Trump: ‘‘నీకు ఎంత మంది భార్యలు’’.. దేశాధ్యక్షుడిని అడిగిన ట్రంప్..

Trump

Trump

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా వైట్ హౌజ్‌లో భేటీ అయ్యారు. ఒకప్పుడు ఉగ్రవాదిగా ముద్ర పడిన అల్ షరా ఇప్పుడు సిరియా దేశాధినేత. ఆయనపై అమెరికా 10 మిలియన్ డాలర్ల బహుమతి కూడా ప్రకటించింది. అలాంటిది ఇప్పుడు అల్ షరా, ట్రంప్‌లు పక్కపక్కన నిలబడి చర్చించుకున్నారు. 1946లో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్ర్యం పొందిన తర్వాత తొలిసారిగా ఒక సిరియా అధ్యక్షుడు వైట్ హౌజ్‌ అధికార పర్యటనకు వెళ్లారు. సిరియాపై ఆంక్షల ఉపశమనాన్ని అమెరికా మరో 180 రోజుల పాటు పొడిగించిన ఈ సందర్శన జరిగింది.

Read Also: Chidambaram: ” నేను అప్పుడే చెప్పాను.. నన్ను ట్రోల్ చేశారు”.. ఉగ్రదాడిపై మాజీ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు..

అయితే, ఇప్పుడు ట్రంప్, అల్ షరాల మధ్య జరిగిన చిన్న వీడియో వైరల్ అవుతోంది. ట్రంప్ ఆల్ షరాకు ఒక పెర్ఫ్యూమ్ బాటిల్ ను అందిస్తూ, దానిని అతడిపై స్ప్రే చేస్తూ, ‘‘ఇది మంచి సువాసన కలిగి ఉందని, మరొకటి మీ భార్య కోసం’’ అని అన్నారు. సరదాగా ‘‘ఎంత మంది భార్యలు.?’’ అని ప్రశ్నిస్తారు. దీనికి అల్ షరా స్పందిస్తూ ‘‘ఒక్కరే’’ అని బదులిస్తారు. ట్రంప్ దీనికి స్పందిస్తూ ‘‘మీకు ఎప్పటికీ తెలియదు’’ అని సరదాగా అంటారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ పర్యటనలో అల్ షరా ట్రంప్‌కు పురాతన సిరియన్ కళాఖండాల ప్రతిరూపాలను బహుకరించారు. వీటిలో చరిత్రలోనే మొదటి ఆల్ఫాబెట్, చరిత్రలో మొదటి స్టాంప్ వంటికి ఇచ్చినట్లు చెప్పారు. అల్ షరా గురించి ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘మనందరికి కఠినమైన గతాలు ఉన్నాయి. కానీ అతడికి కఠినమైన గతం ఉంది. నేను నిజాయితీగా చెప్పాలంటే, మీకు కఠినమైన గతం లేకపోతే, మీకు అవకాశం ఉండదు’’ అని అన్నారు. డిసెంబర్ 8న, ఇస్లామిస్ట్ దళాలు చేసిన మెరుపు దాడిలో సిరియాలో బషర్ అల్ అసద్ పాలన అంతమైంది. 43 ఏళ్ల అల్ షరా అధికారాన్ని చేజిక్కించుకున్నాడు.

Exit mobile version