Trump-Iran: ‘వాస్తవ ప్రపంచంలో జీవించండి’.. ట్రంప్‌కు ఇరాన్ ఘాటు రిప్లై
- ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ ఘాటు రిప్లై
- ‘వాస్తవ ప్రపంచంలో జీవించండి’
- ట్రంప్‌కు హితవు పలికిన అబ్బాస్ అరాఖ్చీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల మాట్లాడుతూ తాను ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీని కలవాలనుకుంటున్నట్లు తెలిపారు. ఒప్పందం కుదిరితే ఖమేనీని కలవడం తనకు గౌరవంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు తాజాగా ఇరాన్ ఘాటుగా స్పందించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ‘వాస్తవ ప్రపంచంలో జీవించండి’ అంటూ బదులిచ్చారు.
“ట్రంప్ మొజ్తబా ఖమేనీతో సమావేశం కావాలని అనుకుంటున్నారనే వార్తలు చూశాను. కానీ మనం వాస్తవ ప్రపంచంలో జీవిస్తూ.. వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలి” అంటూ అరాఖ్చీ వ్యాఖ్యానించారు. ట్రంప్ చేసిన ప్రకటనలు ప్రస్తుత పరిస్థితులకు దూరంగా ఉన్నాయని పరోక్షంగా విమర్శించారు.
Also Read
ఈ వారం ప్రారంభంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరితే మొజ్తబా ఖమేనీతో సమావేశం కావడం సాధ్యమేనని అన్నారు. “నేను తప్పనిసరిగా కలవాలని కోరుకోవడం లేదు. కానీ కలిస్తే అది నాకు గౌరవంగా ఉంటుంది. ఒప్పందం కుదిరితే భేటీ జరిగే అవకాశం ఉంది” అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా-ఇరాన్ చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని కూడా తెలిపారు. “ఒప్పందం కుదరకపోవచ్చు కూడా. కానీ కుదిరితే ఈ వారాంతంలోనే జరిగే అవకాశం ఉంది” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఒకవైపు అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పంద చర్చలు కొనసాగుతుండగా.. మరోవైపు సైనిక ఉద్రిక్తతలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ట్రంప్ ప్రతిపాదించిన సమావేశంపై ఇరాన్ సానుకూల సంకేతాలు ఇవ్వకపోవడంతో భవిష్యత్ చర్చలపై అనిశ్చితి నెలకొంది. పశ్చిమాసియాలో శాంతి స్థిరపడుతుందా? లేక మరోసారి ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా? అన్నది అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
-
Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. “రింగ్ ఆఫ్ ఫైర్”లో ఏం జరుగుతోంది?
-
Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
-
Telangana Congress : కాంగ్రెస్‌లో బిగ్ షాక్.. కొండా సురేఖ, చిన్నారెడ్డికి ఎసరు.?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!