Donald Trump: “హోర్ముజ్ మూసేస్తాం”.. ట్రంప్ వార్నింగ్‌తో ప్రపంచం టెన్షన్..
- హార్ముజ్‌ను మూసేస్తాం, ట్రంప్ సంచలన హెచ్చరిక..
- చర్చల విఫలం తర్వాత చెలరేగిన ట్రంప్..
- ట్రంప్ హెచ్చరికలతో ప్రపంచంలో టెన్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: పాకిస్తాన్ వేదికగా జరిగిన అమెరికా-ఇరాన్ చర్చలు విఫలమైన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హార్ముజ్ జలసంధిలోకి ప్రవేశించడానికి లేదా దాని నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్న నౌకల్ని తాము అడ్డుకుంటామని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ట్రంప్ నిర్ణయంతో ప్రపంచం షాక్ అయింది. ట్రంప్ చర్యలతో గ్లోబల్ ఆయిల్ క్రైసిస్ ఏర్పడే అవకాశం ఉంది.
“తక్షణమే అమలులోకి వచ్చేలా, హోర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించడానికి లేదా దాని నుండి బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్న అన్ని నౌకలను దిగ్బంధించే ప్రక్రియను యునైటెడ్ స్టేట్స్ నౌకాదళం ప్రారంభిస్తుంది,” అని ఆయన అన్నారు. హార్ముజ్ తెరిచి ఉంచుతామన్న హామీలను ఇరాన్ నెలబెట్టుకోలేదని, సముద్రంలో మైన్లు ఉన్నాయన్న భయంతో ఇప్పటికే నౌకల రాకపోకలు తగ్గిపోయాయని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
Read Also: Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!
ఇస్లామాబాద్ చర్చల్లో ఇరాన్ అధికారులతో పలు అంశాలపై ఒప్పందం కుదిరిందని, అయితే, అణుశక్తిపై ఒప్పందం కుదరలేదని ట్రంప్ చెప్పారు. ఇరాన్‌కు ఎప్పటికీ అణ్వాయుదాలు ఉండవని హెచ్చరించారు. హార్ముజ్ జలసంధిలోని మైన్‌లను తొలగిస్తామని, ఇరాన్ ‘‘చట్టవిరుద్ధమైన సుంకాలు’’ చెల్లిస్తున్న నౌకల్ని అడ్డుకుంటామని ఆయన తెలిపారు. చట్టవిరుద్ధమైన సుంకాలు చెల్లించే వారికి బహిరంగ సముద్రంలో సురక్షిత ప్రయాణం ఉండదని హెచ్చరించారు. ఇరాన్‌ను ప్రపంచదోపిడీదారుగా అభివర్ణించారు. అమెరికా బలగాలను, వాణిజ్య నౌకల్ని లక్ష్యంగా చేసుకునే ఏ చర్యకైనా తీవ్ర ప్రతీకారం ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్ సైనిక సామర్థ్యం ఇప్పటికే గణనీయంగా దెబ్బతిందని, వాయు రక్షణ వ్యవస్థ చాలా వరకు నిర్వీర్యమైందని ట్రంప్ అన్నారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!