NTV Telugu Site icon

Donald Trump: వరుస వివాదాల్లో ట్రంప్.. న్యూక్లియర్ సీక్రెట్స్ లీక్..

Untitled 2

Untitled 2

America; అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస వివాదాలను ఎదుర్కొంటున్నాడు. ఓ వైపు సివిల్ వ్యాపారం కేసు నడుస్తుంటే మరో వైపు అమెరికా అంతర్గత రహస్యాలను లీక్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ట్రంప్. వివరాలలోకి వెళ్తే.. US అణ్వాయుధశాలలో కొన్ని ఆయుధాల గురించి అత్యంత రహస్య విషయాలను ట్రంప్ లీక్ చేశారనే ఆరోపణ వెలుగు చూసింది. ABC న్యూస్ మరియు ది న్యూయార్క్ టైమ్స్ నివేదికల ప్రకారం అమెరికా నావికాదళానికి చెందిన ఎలైట్ సబ్‌మెరైన్ ఫ్లీట్‌కు సంబంధించిన కీలక వివరాలను ఆస్ట్రేలియన్ బిలియనీర్ ఆంథోనీ ప్రాట్‌కు మరియు మరికొంతమంది స్నేహితులకు సమాచారం అందిచారు ట్రంప్.

Read also:Joe Biden: జిన్‌పింగ్‌ ని కలవనున్న జో బిడెన్‌.. కారణం ఇదేనా..?

ట్రంప్ అధ్యక్ష పదవి నుండి వైదొలిగినప్పటినుండి అనేక నేరారోపణలు ఎదుర్కొంటున్నాడు. తన ఫ్లోరిడా మాన్షన్‌లో రహస్య పత్రాలు దొరకడం, పౌరులకు యుద్ధ ప్రణాళికల వివరాలను వెల్లడించడం, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మరియు నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ నుండి అసెస్‌మెంట్‌లను కలిగి ఉన్న పత్రాలను తిరిగి పొందడానికి ప్రభుత్వ చేసిన ప్రయత్నాలను అడ్డుకోవడం వంటి 40 కౌంట్‌లపై ఫెడరల్ నేరారోపణతో పోరాడుతున్నారు. కాగా ఈ ఆరోపణల పైన స్పందించిన ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ చేసారు. ఈ పోస్ట్ లో జలాంతర్గామి ఆరోపణలను “తప్పుడు మరియు హాస్యాస్పదమైనది” గా అయన పేర్కొన్నారు. కాగా 2017 లో అధ్యక్ష పదివి స్వీకరణ ప్రారంభంలో ట్రంప్ ఇజ్రాయెల్ నుండి రష్యా విదేశాంగ మంత్రి మరియు రాయబారికి కీలకమైన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని అందించినట్లు నివేదిక ఉంది.