Site icon NTV Telugu

Trump: హమాస్‌కు ట్రంప్ కొత్త డెడ్‌లైన్.. లేదంటే ఆదివారం నరకం చూస్తారని హెచ్చరిక

Trump4

Trump4

హమాస్ ఉగ్రవాదులకు ట్రంప్ కొత్త డెడ్‌లైన్ విధించారు. ఆదివారం సాయంత్రం 6 గంటలలోపు శాంతి ఒప్పందానికి రావాలని కోరారు. లేదంటే సాయంత్రం 6 గంటల తర్వాత నరకం చూస్తారని హెచ్చరించారు. ఇటీవల గాజా-ఇజ్రాయెల్ మధ్య 20 పాయింట్ల ప్రణాళికను ట్రంప్ ప్రవేశపెట్టారు. దీనికి ఆయా దేశాలు మద్దతు తెలిపాయి. కానీ హమాస్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. సజీవంగా ఉన్న బందీలను, చనిపోయిన బందీలను ఇజ్రాయెల్‌కు అప్పగించాలని.. అలాగే ఇజ్రాయెల్ జైల్లో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టాలని ట్రంప్ ప్రతిపాదించిన ప్రణాళికలో ముఖ్యమైనవి.

ఇది కూడా చదవండి: Delhi Liquor Policy: ఢిల్లీలో కొత్త లిక్కర్ పాలసీకి ప్లాన్!.. 25 ఏళ్ల వయసు తగ్గించే యోచన

అయితే ట్రంప్ ప్రతిపాదించిన ప్రణాళికపై ఇప్పటి వరకు హమాస్ స్పందించలేదు. దీంతో మరోసారి అల్టిమేటం విధించారు. ఆదివారం సాయంత్రం 6 గంటలలోపు ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందానికి అంగీకరించాలని.. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలని ట్రంప్ హమాస్‌కు అల్టిమేటం జారీ చేశారు. ఇంతకు ముందు ఎవరూ చూడని నరకం చూడాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: UP: సినిమా రేంజ్‌లో కాల్పులు.. హత్య దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్ట్

గాజా-ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించేందుకు 20 పాయింట్ల రోడ్‌మ్యాప్‌ను వైట్‌హౌస్ విడుదల చేసింది. తక్షణ కాల్పుల విరమణ, బందీల విడుదల, కొత్త పరిపాలనా ఏర్పాటుకు దశలవారీగా విస్తరించడం.. మొదలగు అంశాలు ఉన్నాయి. అయితే ఈ ప్రణాళికను ఆయా దేశాలు స్వాగతించాయి. కానీ హమాస్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు డెడ్‌లైన్ విధించారు. ఆ సమయానికి శాంతి ఒప్పందం చేసుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హమాస్‌ను హెచ్చరించారు.

Exit mobile version