Site icon NTV Telugu

Trump: ఆ పత్రిక అత్యంత చెత్తది.. న్యూయార్క్ టైమ్స్‌పై ట్రంప్ 15 బిలియన్ల దావా

Trump6

Trump6

అమెరికా దేశ చరిత్రలో న్యూయార్క్ టైమ్స్ వార్తాపత్రిక అత్యంత చెత్త పత్రిక అని డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలోనే అత్యంత దిగజారుడు వార్తాపత్రిక అంటూ నిప్పులుచెరిగారు. ‘‘రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్ పార్టీకి వర్చువల్ మౌత్ పీస్”గా ట్రంప్ అభివర్ణించారు. న్యూయార్క్ టైమ్స్‌పై దావా వేస్తున్నట్లు తెలిపారు. తనకు వ్యతిరేకంగా దశాబ్దాలుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నందుకు 15 బిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Guwahati: మహిళా ఆఫీసర్ ఇంటిపై దాడి.. భారీగా నోట్ల కట్టలు లభ్యం.. ఉద్యోగంలో చేరి ఎన్ని రోజులైదంటే..!

అత్యంత దిగజారుడు వార్తాపత్రికల్లో ఒకటైన ది న్యూయార్క్ టైమ్స్‌పై 15 బిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేసే గొప్ప గౌరవం తనకు లభించిందని తెలిపారు. ఈ పత్రిక కమలా హారిస్‌కు మౌత్ పీస్ అని ఆరోపించారు. ఇంత కాలం అబద్ధాలు ప్రచారం చేస్తున్నా.. పట్టించుకోలేదని.. ఇప్పుడు గ్రేట్ స్టేట్ ఆఫ్ ఫ్లోరిడాలో వేయబోతున్నట్లు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Delhi BMW crash: బీఎండబ్ల్యూ కారు ప్రమాదంలో కీలక ట్విస్ట్.. నిందితురాలు షాకింగ్ స్టేట్‌మెంట్

గత కొద్దిరోజులుగా లైంగిక ఆరోపణలు కలిగిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌కు సంబంధాలు ఉన్నాయంటూ న్యూయార్క్ టైమ్స్ వరుస కథనాలు ప్రచురిస్తోంది. తనపై, తన కుటుంబంపై దశాబ్దాలుగా అసత్య ప్రచారాలు వ్యాప్తి చేస్తోందని.. ఈ నేపత్యంలో ఫ్లోరిడాలో రూ.1.32 లక్షల కోట్లకు దావా వేస్తున్నట్లు వెల్లడించారు.

జెఫ్రీ ఎప్‌స్టీన్‌ అమ్మాయిలకు డబ్బు ఆశ చూపించి వారిపై అఘాయిత్యాలకు పాల్పడినట్లుగా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఇలా రెండు దశాబ్దాల పాటు ఈ చీకటి వ్యవహారం నడిచింది. 2005లో ఈ సెక్స్ స్కామ్ బట్టబయలైంది. 2019, ఆగస్టులో అతడు జైల్లోనే అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అది ఆత్మహత్యగా పోలీసులు తేల్చారు. అయితే ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌కు సంబంధాలు ఉన్నట్లు అమెరికా పత్రికల్లో పలు కథనాలు వెలువడ్డాయి.

 

Exit mobile version