అమెరికా అధ్యక్షుడు ట్రంప్-టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చాలా రోజుల తర్వాత పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఇందుకు చార్లీ కిర్క్ సంతాప కార్యక్రమం వేదిక అయిది. ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది చార్లీ కిర్క్‌ను గుర్తు చేసుకుంటూ ఆదివారం స్మారక మెమోరియల్ సర్వీస్ జరిగింది. ఈ కార్యక్రమానికి ట్రంప్, జేడీ వాన్స్, చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్, మస్క్ సహా ప్రముఖులంతా హాజరయ్యారు.
2024లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్-మస్క్ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక ఎన్నికల్లో గెలిచాక ఇద్దరు కూడా చాలా సాన్నిహిత్యంగా మెలిగారు. ఏమైందో ఏమో తెలియదు గానీ ఇద్దరికి పొసగక విడిపోయారు. ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని మస్క్ విమర్శించారు. ట్రంప్ తీసుకొచ్చిన బ్యూటీఫుల్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విమర్శల నేపథ్యంలో ఇద్దరూ దూరమైపోయారు. అంతేకాకుండా ఈ మధ్య వైట్‌హౌస్‌లో ఐటీ దిగ్గజ అధినేతలకు ప్రత్యేక విందు ఇచ్చారు. కానీ మస్క్ హాజరు కాలేదు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందని వార్తలు వచ్చాయి.
సెప్టెంబర్ 10న ఉతా వ్యాలీ యూనివర్సిటీలో చార్లీ కిర్క్ ప్రసంగిస్తుండగా దుండగుడు తుపాకీతో కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని ట్రంప్ ప్రకటించారు. ఇక చార్లీ కిర్క్‌ను జ్ఞాపకం చేసుకుంటూ ఆదివారం సంతాప కార్యక్రమం నిర్వహించారు. దీనికి ట్రంప్-మస్క్ హాజరై సంభాషించుకున్నారు. దీంతో చాలా రోజుల తర్వాత ఇద్దరూ కలవడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక చార్లీ కిర్క్ భార్య ఎరికా మాట్లాడుతూ.. తన భర్తను చంపిన నిందితుడిని క్షమించేశానని ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ చివరి చూపు కోసం లక్షలాదిగా తరలివచ్చిన అస్సామీయులు.. 25 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్
