Site icon NTV Telugu

Trump: మరో యుద్ధాన్ని ప్రకటించిన ట్రంప్.. నెక్ట్స్ దేశం ఇదే!

Trump

Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా దూకుడుగా వెళ్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో వెనిజులా అధ్యక్షుడు మదురోను కిడ్నాప్ చేసి దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా యుద్ధం చేస్తోంది. అత్యంత శక్తివంతమైన నాయకుడు ఇరాన్ సుప్రీం లీడర అయతుల్లా ఖమేనీని అంతమొందించింది. తాజాగా మరో దేశంపై ట్రంప్ గురిపెట్టారు. త్వరలో క్యూబా పతనం కాబోతుందని ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Bengaluru: బెంగళూరుకు మరో ఎయిర్‌పోర్ట్.. ప్రకటించిన సీఎం సిద్ధరామయ్య

సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు… ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా సైన్యం పనితీరును అద్భుతం అంటూ ప్రశంసించారు. క్యూబా త్వరలోనే పతనం కాబోతోందని.. విదేశాంగ కార్యదర్శి రూబియోను అక్కడికి పంపాలని యోచిస్తున్నట్లు తెలిపారు. క్యూబా ఆరు దశాబ్దాలుగా అమెరికా ఆంక్షల కింద ఉందని.. 2021 నిరసనల తర్వాత అశాంతిలో చిక్కుకుందని పేర్కొన్నారు. వాషింగ్టన్ దృష్టి ఇరాన్ యుద్ధంకే పరిమితం కాదని.. దాని భౌగోళిక రాజకీయ ఉద్దేశాలు.. అంతకు మించి విస్తరించవచ్చని సూచించారు.

ఇది కూడా చదవండి: Gas Cylinder Priced Hiked: యుద్ధం వేళ కేంద్రం షాక్.. భారీగా పెరిగిన వంటింటి గ్యాస్ ధర

క్యూబా వలస కుటుంబం నుంచి వచ్చిన రూబియో… క్యూబా రాజధాని హవానాలో పాలన మార్పు కోసం చాలా కాలంగా ప్రయత్నించాడని తెలిపారు. క్యూబాలో పాలన మార్పును అమెరికా కోరుకుంటోందని స్పష్టం చేశారు. గల్ఫ్ అరబ్ దేశాలపై దాడి చేయడం ద్వారా ఇరాన్ ఘోరమైన తప్పు చేసిందన్నారు. గల్ఫ్ దేశాలు నమ్మశక్యం కాని విధంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు. అరబ్ దేశాల ప్రతిస్పందన ఆకట్టుకునేలా ఉందని అభివర్ణించారు.

యుద్ధం తర్వాత ఇరాన్‌కు ఎవరు నాయకత్వం వహిస్తారని అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానం ఇస్తూ…. ఈ ప్రక్రియ వెనిజులా తరహాలోనే ఉంటుందని… కొత్త నాయకత్వం అమెరికా- ఇజ్రాయెల్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉంటుందని అన్నారు. ఇంధన సరఫరా అంతరాయాల కారణంగా చమురు ధరలు పెరుగుతున్నాయనే ఆందోళనలను తాత్కాలికం అని.. పరిస్థితి త్వరలో సాధారణ స్థితికి వస్తుందని ట్రంప్ అన్నారు.

Exit mobile version