Site icon NTV Telugu

Donald Trump: ఇండియా-పాక్‌ మధ్య యుద్ధాన్ని ఆపింది నేనే.. ట్రంప్ నోట అవే కామెంట్స్.. బీజేపీపై కాంగ్రెస్ ఫైర్!

Trump

Trump

Donald Trump: భారత్- పాకిస్తాన్‌ల మధ్య అణు యుద్ధాన్ని నేనే ఆపానని ఇప్పటికే అనేక సార్లు ప్రకటించిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. తాజాగా మరోసారి ఇవే కామెంట్స్ చేశారు. బుధవారం నాడు నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో నాటో శిఖరాగ్ర సమావేశం కొనసాగింది. ఈ మీటింగ్ లో పాల్గొన్న ట్రంప్‌ ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలన్నీ తానే ఆపానంటూ క్రెడిట్‌ తీసుకునే ప్రయత్నం చేశారు.

Read Also: Jani Master : జానీ మాస్టర్ కు ఛాన్స్ ఇచ్చిన టాలీవుడ్ స్టార్ హీరో

ఇక, ఇరాన్‌- ఇజ్రాయెల్‌, రష్యా- ఉక్రెయిన్‌ల యుద్ధాలను గురించి ప్రత్యేకంగా మాట్లాడిన ట్రంప్‌.. ఈ సందర్భంగా.. నేను జోక్యం చేసుకోవడంతోనే భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గిపోయాయని తెలిపారు. ఇరు దేశాలకు నేతలకు నేను వరుస ఫోన్‌ కాల్స్‌ చేయడంతోనే యుద్ధం ముగించారు అని పేర్కొన్నారు. మీరు ఒకరితో ఒకరు పోరాడితే మేం ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకోమని వారికి చెప్పాం.. భారత ప్రధాని మోడీ నాకు మంచి స్నేహితుడు .. పాక్‌ జనరల్ అసిఫ్ మునీర్ ఆకట్టుకునే వ్యక్తి.. వారు కూడా వాణిజ్య ఒప్పందమే కావాలని చెప్పుకొచ్చారు.. అలా మేమే ఆ అణు యుద్ధాన్ని ఆపేశామని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.

Read Also: Fairphone Gen 6: 5 ఏళ్ల వారంటీ, మరమ్మతులకు అనుకూలంగా ఉండేలా మొబైల్ లాంచ్..!

అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కామెంట్స్ పై కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ట్రంప్ మాట్లాడిన వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు కాంగ్రెస్‌ సీనియర్ నేత జై రాం రమేశ్‌. దీనికి మే 10వ తేదీ నుంచి ట్రంప్‌ ఇలా చెప్పడం 16వ సారి అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అలాగే, హస్తం పార్టీ నేత పవన్‌ ఖేరా కూడా.. ట్రంప్‌ ఒత్తిడికి లొంగిపోయి ప్రధాని భారత ప్రయోజనాలను తుంగలో తొక్కారని కామెంట్స్ చేశారు. కాగా, భారత్‌, పాక్‌ల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయం లేదని మోడీ ఇటీవల చెప్పారు. ఇది రెండు దేశాల సైన్యం చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయమని వెల్లడించారు. ఇందులో ఏ దేశం కూడా మధ్యవర్తిగా వ్యవహరించ లేరని తెలిపారు. ఈ విషయాన్ని తాను స్వయంగా ట్రంప్ కి ఫోన్‌లో చెప్పానని ప్రధాని మోడీ చెప్పారు.

Exit mobile version