ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరు పక్షాలు భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితులు ఎక్కడకి దారి తీస్తాయేమోనని ప్రపంచ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. టెహ్రాన్ ప్రజలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే టెహ్రాన్‌ను ఖాళీ చేయాలని ఆదేశించారు.
ఇది కూడా చదవండి: Hyderabad: ఇప్పట్లో ఆగేలా లేరే.. ఆసిఫ్ నగర్ లో భర్తపై ప్రియుడితో కలిసి భార్య దాడి..
ఇప్పటికైనా ఇరాన్‌కు సమయం మించిపోలేదని.. అమెరికాతో అణు ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ సూచించారు. కెనడా వేదికగా జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందాన్ని అంగీకరించాల్సి ఉండాల్సిందని వ్యాఖ్యనించారు. మరింత సమయం ఆలస్యం కాకముందే ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని.. ఇప్పటికే రెండో అవకాశం ఇచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ట్రంప్ గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: Mukul Dev : ముకుల్ దేవ్ మృతి పై.. సోదరుడు రాహుల్ దేవ్ ఎమోషనల్ రియాక్షన్
‘‘నేను చెప్పిన అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసి ఉండాల్సింది. ఇప్పుడు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇది ఎంత సిగ్గుమాలిన చర్య. ఇంకాస్త సులువుగా చెప్పాలంటే.. ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయలేదు. ఇప్పటికే పదే పదే చెప్పా. అందరూ టెహ్రాన్‌ను ఖాళీ చేయాలి’’ అని ట్రంప్ పోస్టు చేశారు. ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారే ప్రమాదం లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ట్రంప్ జీ 7 సదస్సు కుదించుకుని అమెరికా వచ్చేస్తున్నట్లు వైట్‌హౌస్ తెలిపింది. ట్రంప్ తన జాతీయ భద్రతా మండలిని సమావేశపరుస్తారని ఫాక్స్ న్యూస్ నివేదించింది.
ఇదిలా ఉంటే మంగళవారం తెల్లవారుజామున కూడా టెహ్రాన్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి. భారీ వైమానిక దాడులు జరిగాయి. ఈ మేరకు ఇరాన్ మీడియా తెలిపింది. 320 కి.మీ దూరంలో ఉన్న అణు స్థాపనకు నిలయమైన నటాంజ్‌లో వైమానిక దాడులు జరిగినట్లుగా వార్తలు వెలువడుతున్నాయి.
ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించేలా ట్రంప్‌పై ఒత్తిడి తీసుకురావాలని ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాలను ట్రెహాన్ కోరినట్లు రాయిటర్స్ వర్గాలు తెలిపాయి.
22
