NTV Telugu Site icon

Donald Trump: అమెరికాలో కెనడాను విలీనం.. ట్రూడో రాజీనామా తర్వాత ట్రంప్ కామెంట్స్..!

Canada Us

Canada Us

Donald Trump: కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో రాజీనామా చేసిన కొన్ని గంటలకే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కెనడాను యునైటెడ్ స్టేట్స్ లో 51వ రాష్ట్రంగా విలీనం చేసే ప్రతిపాదనను పునరుద్ధరిస్తామని చెప్పుకొచ్చారు. అయితే, కెనడాలో చాలా మంది ప్రజలు కెనడాను అమెరికాలో విలీనం చేసేందుకు ఇష్టపడుతున్నారని ఈ సందర్భంగా అతడు పేర్కొన్నారు. కాగా, కెనడాకు అవసరమైన వాణిజ్య లోటును, రాయితీలను యునైటెడ్ స్టేట్స్ ఇకపై అనుభవించదు అని తెలిసే జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేశారు అని డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో వెల్లడించారు. కెనడా యుఎస్‌తో విలీనమైతే, సుంకాలు ఉండవు, పన్నులు తగ్గుతాయి.. అలాగే, రష్యన్, చైనీస్ షిప్‌ల ముప్పు నుంచి పూర్తి సురక్షితంగా ఉంటుందని ట్రంప్ తెలిపాడు.

Read Also: Allu Arjun : నేడు కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్

కాగా, జస్టిన్ ట్రూడోపై గత కొంత కాలంగా పెరుగుతున్న ప్రజావ్యతిరేకతతో పాటు అధికార లిబరల్ పార్టీ బలవంతం చేయడంతో సోమవారం నాడు ప్రధాన మంత్రి పదవికీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు తాను ప్రధానిగా కొనసాగుతానని ట్రూడో చెప్పుకొచ్చారు. అయితే, ట్రంప్ తో 2017-2021 వరకు మొదటి టర్మ్‌లో ట్రూడోకు మంచి సంబంధాలు ఉండేవి. కానీ, నవంబర్ 5న జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ట్రూడోను కలిసినప్పటి నుంచి కెనడాను యునైటెడ్ స్టేట్స్ యొక్క 51వ రాష్ట్రంగా చేయాలనే ఆలోచనలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు.

Show comments