Site icon NTV Telugu

Trump: ఏడాదిలోపే చైనా తినేస్తోంది.. కెనడాకు ట్రంప్ వార్నింగ్

Trump1

Trump1

కెనడా లక్ష్యంగా మరోసారి ట్రంప్ విరుచుకుపడ్డారు. గ్రీన్‌లాండ్‌పై గోల్డెన్ డోమ్ నిర్మించడాన్ని కెనడా వ్యతిరేకిస్తోంది. అదే సమయంలో చైనాతో సంబంధాలు పెట్టుకోవాలని భావిస్తోంది. ఈ వ్యవహారం ట్రంప్‌కు భారీ కోపం తెప్పించింది. తమ భద్రతా వ్యవస్థను కాదని.. చైనాతో సంబంధాలు పెట్టుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ‘‘మూల్యం చెల్లించుకుంటారు.’’ అంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఏడాదిలోపే బీజింగ్ వారిని తినేస్తోందని వ్యాఖ్యానించారు.

దావోస్ వేదికగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా నేతృత్వంలోని ప్రపంచంలో ‘చీలిక’ జరుగుతోందని మార్క్ కార్నీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ట్రంప్‌కు ఆగ్రహాన్ని తెప్పించింది. ‘బోర్డ్ ఆఫ్ పీస్’ ఆహ్వాన పత్రికను వెనక్కి తీసుకుంటున్నట్లు ట్రంప్ వెల్లడించారు.

తాజాగా అమెరికాతో కాకుండా చైనాతో సంబంధాలు పెట్టుకోవడం ఏ మాత్రం ట్రంప్‌కు రుచించలేదు. పైగా గ్రీన్‌లాండ్ ‘గోల్డెన్ డోమ్’ నిర్మించడాన్ని కెనడా వ్యతిరేకించింది. గోల్డెన్ డోమ్ అనేది కెనడాను రక్షిస్తుంది.. అలాంటిది చైనాతో వ్యాపారం చేసేందుకు మొగ్గు చూపిందని… ఏడాదిలోపే దాన్ని తినేస్తుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

జనవరి 17న కెనడా ప్రధాని మార్క్ కార్నీ.. చైనాతో వాణిజ్య ఒప్పందం చేసుకుంది. ప్రతిగా చైనా ఎలక్ట్రిక్ కార్లపై 100 శాతం సుంకాన్ని తగ్గించడానికి కెనడా అంగీకరించింది. ఈ సందర్భంగా అమెరికా కంటే చైనానే మంచి భాగస్వామిగా మారిందని కార్నీ అన్నారు.

ఇది కూడా చదవండి: Tamil Nadu: ఎన్నికల వేళ కీలక ఘట్టం.. ప్రైవేటు స్కూళ్ల ఫీజుల నియంత్రణ బిల్లుకు ఆమోదం

ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా వల్లే కెనడా జీవిస్తోందని.. కనీసం కృతజ్ఞత లేదని వ్యాఖ్యానించారు. అయితే దావోస్‌లో ఉన్న కెనడా ప్రధాని మార్క్ కార్నీ.. ట్రంప్ వాదనను తప్పికొట్టారు. కెనడా అమెరికా వల్ల బ్రతకడం లేదని.. కెనడియన్లం కాబట్టి కెనడా అభివృద్ధి చెందుతోందన్నారు. ఇక అమెరికా నేతృత్వంలోని ప్రపంచ క్రమంలో ‘చీలిక’ జరుగుతోందని మార్క్ కార్నీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే ట్రంప్‌కు కోపం తెప్పించాయి. ప్రస్తుతానికి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి.

ఇది కూడా చదవండి: MK Stalin: ఆ పదవిని అవమానించారు.. గవర్నర్ రవిపై స్టాలిన్ ధ్వజం

Exit mobile version