Site icon NTV Telugu

Donald Trump: “ప్రపంచంలోనే చెత్త మేయర్”.. సాదిక్ ఖాన్‌పై ట్రంప్ ఫైర్..

Trump

Trump

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, లండన్ తొలి ముస్లి్ం మేయర్ సాదిక్ ఖాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యూకే పర్యటనలో ఉన్న ట్రంప్, సాదిక్ ఖాన్ ‘‘ప్రపంచంలోనే చెత్త మేయర్లలో ఒకరు’’ అని విమర్శించారు. యూకే రాజధానిలో నేరాలు, వలసల్ని అరికట్టడంతో ఆయన విఫలమయ్యారని అన్నారు. తన గౌరవార్థం యూకే ప్రభుత్వం ఇస్తున్న విందుకు అతడిని ఆహ్వానించవద్దని తానను వ్యక్తిగతంగా కోరినట్లు వెల్లడించారు.

Read Also: India: సౌదీ అరేబియా వీటిని దృష్టిలో ఉంచుకోవాలి.. పాక్‌తో రక్షణ ఒప్పందంపై భారత్..

‘‘నేను సాదిక్ ఖాన్ విందుకు రావద్దని అనుకుంటున్నాను. లండన్ మేయర్ సాదిక్ ఖాన్ ఆహ్వానించవద్దని కోరాను’’ అని ట్రంప్ గురువారం ఎయిర్ ఫోర్స్ వన్‌లో మీడియాతో అన్నారు. సాదిక్ ఖాన్ విందుకు హాజరయ్యేందుకు ఆసక్తి చూపారని, అయితే తానే ఈ కార్యక్రమానికి అతడు వద్దు అని చెప్పినట్లు ట్రంప్ చెప్పారు. సాదిక్ ఖాన్‌ను ప్రపంచంలోనే చెత్త మేయర్లలో ఒకరిగా అభివర్ణించిన ట్రంప్.. అతను లండన్‌లో భయంకరమైన పని చేశారని ఆరోపించారు. అతను ఇమ్మిగ్రేషన్, నేరాలను అడ్డుకోలేకపోయాడని అన్నారు.

ట్రంప్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుతూ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనను నిరాశ పరిచాడని, యుద్ధాన్ని ఆపడం లేదని అన్నారు. పుతిన్ చాలా మందిని చంపుతున్నాడని, అతను చంపే వారి కన్నా ఎక్కువ మందిని కోల్పోతున్నాడని చెప్పారు. ఉక్రెయిన్ సైనికుల కన్నా రష్యా సైనికులు ఎక్కువ మంది మరణిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Exit mobile version