Site icon NTV Telugu

Donald Trump: “గ్రీన్‌ల్యాండ్” అమెరికా భూభాగమే.. దావోస్‌లో ట్రంప్ ఫైరీ స్పీచ్..

Greenland

Greenland

Donald Trump: దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. అమెరికాకు తప్పా వేరే దేశానికి గ్రీన్‌ల్యాండ్‌ను సురక్షితంగా ఉంచే సామర్థ్యం లేదని చెప్పారు. ఆర్కిటిక్ భూభాగాన్ని వ్యూహాత్మకంగా కీలకమైందిగా ట్రంప్ అభివర్ణించారు. గ్రీన్‌ల్యాండ్ అమెరికా భూభాగమని ఆయన అన్నారు. గతంలో గ్రీన్‌ల్యాండ్ ను అమెరికా వదులుకోవడం మూర్ఖత్వం అని చెప్పారు. డెన్మార్క్ తనంతట తానుగా ద్వీపాన్ని రక్షించుకోలేకపోయిందని పేర్కొన్నారు. లీజుపై గ్రీన్‌ల్యాండ్‌ను తాను రక్షించలేదనని చెప్పారు. గ్రీన్ ల్యాండ్‌‌ను ఐస్ ముక్కగా పిలుస్తూ దాని వ్యూహాత్మక ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, నియంత్రణ కోసం ట్రంప్ డిమాండ్ చేశారు.

Read Also: With Love Teaser: నవ్వులు పూయిస్తున్న అనశ్వర రాజన్ ‘లవ్ విత్’ టీజర్!

‘‘తాము ఏప్పుడూ ఏమీ కోరుకోలేదు, మాకు ఏమీ లభించలేదు. నేను బలాన్ని ఉపయోగించగలను, కానీ ఉపయోగించను. ప్రపంచం నుంచి అమెరికా అడుగుతుంది ఒక్క గ్రీన్‌ల్యాండ్‌ను మాత్రమే’’ అని ట్రంప్ అన్నారు. ఈ ప్రాంతాన్ని రక్షించే సైనిక శక్తి అమెరికా వద్ద మాత్రమే ఉందని, గ్రీన్‌ల్యాండ్‌ను గొప్పగా తీర్చిదిద్దుతానని ట్రంప్ చెప్పారు. యూఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద శక్తి అని, ఇటీవల వెనిజులాలో వారు దీనిని తెలుసుకున్నారని చెప్పారు. గ్రీన్‌ల్యాండ్, డెన్మార్క ప్రజల పట్ల నాకు అపారమైన గౌరవం ఉందని చెబుతూనే, ఆ ప్రాంతం తమకు కవాలని చెప్పారు. ఈ వ్యవహారంలో ‘‘వద్దు’’ అని చెప్పిన వారిని తాను మర్చిపోనని, వారిని గుర్తుంచుకుంటామని హెచ్చరించారు.

Exit mobile version