Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Trump Analysis Of The Republican Defeat In New York Mayor Polls

Trump: ఆ కారణాలతోనే ఓడిపోయాం.. రిపబ్లికన్ల ఓటమిపై ట్రంప్ విచిత్ర విశ్లేషణ

Published Date :November 5, 2025 , 10:11 am
By Suresh Maddala
  • ఆ కారణాలతోనే ఓడిపోయాం
  • రిపబ్లికన్ల ఓటమిపై ట్రంప్ విచిత్ర విశ్లేషణ
Trump: ఆ కారణాలతోనే ఓడిపోయాం.. రిపబ్లికన్ల ఓటమిపై ట్రంప్ విచిత్ర విశ్లేషణ
  • Follow Us :
  • google news
  • dailyhunt

అమెరికాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ట్రంప్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఏడాది పాలనలో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. న్యూయార్క్ మేయర్ పదవితో పాటు వర్జీనియా, న్యూజెర్సీ గవర్నర్ పదవులన్నీ డెమోక్రాటిక్ పార్టీ కైవసం చేసుకుంది.

తాజాగా సోషల్ మీడియా వేదికగా ట్రంప్ వైరటీగా స్పందించారు. బ్యాలెట్‌పై తన పేరు లేకపోవడంతోనే రిపబ్లికన్లకు ఓటమి ఎదురైందన్నారు. మరోవైపు షట్‌డౌన్‌ పరిస్థితులు కూడా ఒక కారణంగా చెప్పారు. ఈ మేరకు ఆయన ట్రూత్‌ సోషల్‌లో పోస్టు చేశారు.

ఇది కూడా చదవండి: New York Mayor Elections: ట్రంప్‌కు భారీ షాక్.. న్యూయార్క్ మేయర్‌గా మమ్దానీ విజయం

జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. వైట్‌హౌస్‌కు వచ్చిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవి. అనూహ్యంగా డెమోక్రాట్లు భారీ విజయాన్ని అందుకున్నారు. అన్ని చోట్ల రిపబ్లికన్లు ఓటమి పాలయ్యారు. ఈ ఓటమిపై ట్రంప్ మాట్లాడుతూ.. బ్యాలెట్‌లో తన పేరు లేకపోవడం.. రెండోది షట్‌డౌన్‌ కారణం అని పేర్కొన్నారు. డెమోక్రాట్లు అధికారంలోకి వస్తే ఇంధన ఖర్చులు మూడు రెట్లు పెరుగుతాయని ట్రంప్ హెచ్చరించినా ఓటర్లు ఏ మాత్రం లెక్కచేయలేదు.

ఇది కూడా చదవండి: Plane Crashe: అమెరికాలో కూలిన అతిపెద్ద కార్గో విమానం.. ముగ్గురు మృతి

న్యూయార్క్ మేయర్ ఎన్నికల ఫలితాల్లో ఇండియన్-అమెరికన్ ముస్లిం అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ ఘన విజయం సాధించారు. న్యూయార్క్‌కు తొలి ముస్లిం మేయర్‌గా మమ్దానీ రికార్డ్ సృష్టించారు. శతాబ్ద కాలంలో న్యూయార్క్‌ మేయర్‌గా అతి పిన్న వయస్కుడైన మమ్దానీ (34) ఎన్నికై చరిత్ర సృష్టించారు. న్యూయార్క్ మేయర్‌గా మమ్దానీ జనవరి 1, 2026న ప్రమాణస్వీకారం చేయనున్నారు.

మమ్దానీ బ్యాగ్రౌండ్
మమ్దానీ.. అక్టోబర్ 18, 1991లో జన్మించారు. ఉగాండాలోని కంపాలాలో పుట్టారు. విద్యావేత్త మహమూద్ మమ్దానీ, చిత్ర నిర్మాత మీరా నాయర్ దంపతులకు జన్మించారు. మమ్దానీ ఐదేళ్ల వయసులో సౌతాఫ్రికాకు వచ్చారు. అనంతరం ఏడేళ్ల వయసులో అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు. బ్రోంక్స్ హై స్కూల్ ఆఫ్ సైన్స్ నుంచి పట్టభద్రుడయ్యారు. 2014లో మైనేలోని బౌడోయిన్ కళాశాల నుంచి ఆఫ్రికానా అధ్యయనాల్లో మేజర్ డిగ్రీని పొందారు.

మమ్దానీ భార్య పేరు రమా సవాఫ్ దువాజీ. ఈమె సిరియన్-అమెరికన్ చిత్రకారిణి. దువాజీ టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో సిరియన్ తల్లిదండ్రులకు జన్మించింది. యూఎస్, దుబాయ్‌లో ఎక్కువ కాలం గడిపారు. ఖతార్‌లోని వర్జీనియా కామన్వెల్త్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ది ఆర్ట్స్‌లో చదువుకున్నారు. అనంతరంత న్యూయార్క్‌లోని స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ నుంచి ఇలస్ట్రేషన్‌లో మాస్టర్స్ కోసం విశ్వవిద్యాలయంలోని రిచ్‌మండ్ క్యాంపస్‌కు బదిలీ అయ్యారు.

దువాజీ.. న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన వెంటనే 2021లో డేటింగ్ యాప్ హింజ్ ద్వారా మమ్దానీని కలిశారు. అక్టోబర్ 2024లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఫిబ్రవరి 2025లో న్యూయార్క్ నగర క్లర్క్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు.

దువాజీ రచనలు..
ది న్యూయార్కర్, వోగ్, బీబీసీ, ది వాషింగ్టన్ పోస్ట్, టేట్ మోడర్ వంటి ప్రచురణల్లో దువాజీ రచనలు ముద్రింపబడ్డాయి. తరచుగా మధ్యప్రాచ్య మహిళల అనుభవాలను అన్వేషిస్తూ ఉండేవారు.

T1

 

T2

 

T3

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • america
  • New york mayor polls
  • Republican defeat
  • Trump analysis
  • us

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions