Site icon NTV Telugu

Trump: ఆ ముగ్గురూ కలిసి అమెరికాపై కుట్ర.. చైనా కవాతుపై ట్రంప్ ఆరోపణలు

Trump5

Trump5

చైనాలోని బీజింగ్‌లో భారీ ఎత్తున సైనిక కవాతు జరిగింది. బుధవారం పెద్ద అట్టహాసంగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, 25 దేశాధినేతలంతా హాజరయ్యారు. ఇక పుతిన్, జిన్‌పింగ్, కిమ్ ఒక వేదికపై నిలబడి కవాతును వీక్షించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇది కూడా చదవండి: Tejashwi Yadav: నడిరోడ్డుపై కళాకారులతో తేజస్వి యాదవ్ డ్యాన్స్.. వీడియో వైరల్

తాజాగా ఇదే అంశంపై ట్రంప్ స్పందిస్తూ ఆరోపణలు గుప్పించారు. పుతిన్, జిన్‌పింగ్, కిమ్ కలిసి అమెరికాపై కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఇక రెండవ ప్రపంచ యుద్ధంలో చైనా కోసం అమెరికన్ సైనికులు కూడా తమ రక్తాన్ని దారపోశారని.. ఈ విషయాన్ని చైనా గుర్తించుకోవాలని హితవు పలికారు. అమెరికా సైనికుల ధైర్యం, త్యాగాలను జిన్‌పింగ్ గుర్తించి.. గౌరవిస్తారని ఆశిస్తున్నానన్నారు.

ఇది కూడా చదవండి: UP: ఇన్‌స్టాలో వివాహితతో ప్రేమ.. హోటల్‌కు పిలిచి ప్రియుడు ఏం చేశాడంటే…!

రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజింగ్‌‌లో అతి పెద్ద సైనిక ప్రదర్శన చేపట్టింది. 1945లో జపాన్ రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయింది. జపాన్‌పై చైనా విజయం సాధించింది. దీనికి గుర్తుగా సెప్టెంబర్ 3న వార్షికోత్సవం నిర్వహిస్తుంటారు. ఈసారి మాత్రం చైనా భారీ ఆయుధ ప్రదర్శన చేపట్టింది. అత్యాధునికి ఆయుధాలను ప్రదర్శనలో చూపించింది.

Exit mobile version