H-1B Visa Rules: కొత్తగా జారీ చేసే హెచ్-1బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన లక్ష డాలర్ల ఫీజు ఇప్పటికే భారత్‌లోని ఐటీ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలాంటి సమయంలో హెచ్-1బీ వీసాలో మరిన్ని మార్పులు చేసేందుకు ట్రంప్ కార్యవర్గం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ‘రిఫార్మింగ్ ది హెచ్-1బీ నాన్‌ఇమిగ్రెంట్స్ వీసా క్లాసిఫికేషన్ ప్రోగ్రామ్’ కింద ఈ కొత్త ప్రతిపాదనలు ఫెడరల్ రిజిస్టర్‌లో నమోదు అయ్యాయి. దీంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ చేసిన ప్రతిపాదనల మేరకు.. వీసా పరిమితి మినహాయింపుల అర్హతను మరింత కఠినతరం చేయడంతో పాటు వీసా ప్రోగ్రామ్ నిబంధనలను ఉల్లంఘించిన యాజమాన్యాలపై, థర్డ్ పార్టీ నియామకాలపై మరింత దృష్టి పెట్టింది. ఈ మార్పులు హెచ్-1బీ వీసాతో యూఎస్ కార్మికుల వేతనాలు, పని ప్రదేశాల్లో పరిస్థితులకు రక్షణ కల్పించడం కోసం తీసుకొచ్చిందని ఆ ప్రతిపాదనల్లో తెలిపారు.
Read Also: SS Rajamouli: నేడు దర్శకధీరుడు రాజమౌళి పుట్టిన రోజు.. సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ
అయితే, ఈ ప్రతిపాదనల అమలులో మాత్రం పూర్తిస్థాయిలో క్లారిటీ లేదు. మినహాయింపుల పరిమితిలో మార్పులు చేస్తే.. లాభాపేక్ష లేని పరిశోధనా సంస్థలు, విశ్వ విద్యాలయాలు, హెల్త్‌కేర్ సంస్థలు తమకు అందుతున్న ప్రయోజనాలను కోల్పోతాయని అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. అలాగే, యూఎస్ లో నివాసం ఉండాలని కల కంటోన్న వేలాది మంది ఇండియన్ స్టూడెంట్స్, ఆ దేశంలో పని చేయాలని చూస్తున్న యువ నిపుణులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ కొత్త నిబంధనలు డిసెంబర్ 2025లో వెలువడే ఛాన్స్ ఉంది. ట్రంప్ తీసుకువచ్చిన లక్ష డాలర్ల ఫీజు గత నెల నుంచే అమల్లోకి వచ్చింది. దీనికోసం అధ్యక్షుడు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఒక ఏడాది పాటు అమల్లో ఉండనుంది. ఈలోపు యూఎస్ చట్టసభ కాంగ్రెస్‌లో చట్టం చేస్తే, ఆ తర్వాత పూర్తిస్థాయిలో అమలు కానుంది. భారత్ నుంచి హెచ్-1బీ వీసాపై అమెరికాకు వెళ్లే ఒక ఉద్యోగి సగటు వార్షిక వేతనం 60 వేల నుంచి 1.40 వేల డాలర్ల మధ్యలో ఉండాల్సిందే. ఈ పరిస్థితుల్లో హెచ్-1బీ వీసా కోసం ఒక ఉద్యోగిపై లక్ష డాలర్ల ఫీజు చెల్లించడానికి కంపెనీలు ముందుకురావడం కష్టంగా మారనుంది.