H-1B Visa Rules: కొత్తగా జారీ చేసే హెచ్-1బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన లక్ష డాలర్ల ఫీజు ఇప్పటికే భారత్‌లోని ఐటీ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలాంటి సమయంలో హెచ్-1బీ వీసాలో మరిన్ని మార్పులు చేసేందుకు ట్రంప్ కార్యవర్గం ప్రతిపాదనలు సిద్ధం చేశారు.