హెచ్-1బీ లాటరీ వ్యవస్థపై ట్రంప్ పరిపాలన కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్-1బీ లాటరీ వ్యవస్థను సరిదిద్దాలని ట్రంప్ పరిపాలన ప్రతిపాదించింది. అధిక నైపుణ్యం కలిగిన వారు, అధిక జీతం పొందే విదేశీయులకు హెచ్-1బీ వీసాల కేయింపునకు ప్రతిపాదించింది. అందుకు అనుకూలంగా ఉండే వెయిటెడ్ ఎంపిక ప్రక్రియను అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది.
ఇది కూడా చదవండి: Crime News: సినిమా స్టోరీకి మించిన కథ.. దోపిడీ ముసుగులో భార్యను కిరాతకంగా చంపించిన భర్త!
కొత్త ప్రతిపాదన ప్రకారం.. కేటాయించిన వేతన స్థాయి ఆధారంగా ఎంపిక ఉంటుంది. నాలుగు వేతన స్థాయిల్లో అత్యధికంగా ఉన్న కార్మికులు నాలుగు సార్లు ఎంపిక పూల్‌లోకి ప్రవేశిస్తారు. అత్యల్ప స్థాయిలో ఉన్నవారు ఒక్కసారి మాత్రమే ప్రవేశిస్తారు.
కొత్త నియమం అమల్లోకి వస్తే హెచ్-1బీ లాటరీ ఇకపై పూర్తిగా మారిపోతుంది. ప్రతి దరఖాస్తుదారుడి అవకాశాలు జీతం స్థాయి ఆధారంగా ఉంటాయి. ఉన్నత వేతన శ్రేణిలో ఉన్న అభ్యర్థి లాటరీలో బహుళ ఎంట్రీలను పొందవచ్చు. అయితే ప్రారంభ స్థాయి జీతంలో ఉన్న వ్యక్తికి ఒకటి మాత్రమే లభిస్తుంది. అంటే అధిక వేతనం ఉన్న సీనియర్లకు ఎంపిక అవకాశాలు గణనీయంగా మెరుగ్గా ఉంటాయి.
ఇది కూడా చదవండి: Off The Record : ఆ నాయకుడికి టికెట్ చేయి జారిపోయిందా.. చివరకు ఆయనకు దక్కింది ఏంటి?
గత వారం హెచ్-1బీ వీసాపై కొత్త దరఖాస్తుకు భారీగా రుసుము ప్రకటిస్తూ ఫైల్‌పై ట్రంప్ సంతకం చేశారు. ఈ వీసా ద్వారా అమెరికాలోని కంపెనీలు లాటరీ విధానం ద్వారా టెక్నాలజీ, ఇంజనీరింగ్ వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులను నియమించుకోవడానికి అనుమతించింది. అమెరికన్ కార్మికులకు మొదటి స్థానం ఇస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే యూఎస్ పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డేటా ప్రకారం.. ఆమోదించబడిన అన్ని హచ్-1బీ దరఖాస్తులలో 71 శాతం భారతీయులే ఉన్నారు.
