Iran-Israel: ఇరాన్‌కు భారీ ఎదురుదెబ్బలు.. అత్యున్నత భద్రతా అధికారి లారిజానీ హతం
- ఇరాన్‌కు భారీ ఎదురుదెబ్బలు
- అత్యున్నత భద్రతా అధికారి లారిజానీ హతం
- పలువురు ఉన్నతాధికారులు కూడా చనిపోయినట్లు వార్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్‌కు భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అంతమొందించిన ఇజ్రాయెల్.. తాజాగా జరిపిన దాడిలో అత్యున్నత స్థాయిలో ఉన్న ఉన్నతాధికారులను కూడా హతమార్చింది. గత రాత్రి జరిపిన దాడిలో ఇరాన్ అత్యున్నత భద్రతా అధికారి అలీ లారిజానీ కూడా హతమైనట్లుగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ వెల్లడించారు. ఇప్పటికే ఇరాన్ సైన్యాధిపతి సోలేమానీని చంపినట్లుగా ఐడీఎఫ్ వెల్లడించింది. ఇదే ఘటనలో అలీ లారిజాని కూడా చనిపోయినట్లుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇతర ఉన్నతాధికారులను కూడా అంతమొందించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు ఇరాన్ స్పందించలేదు.
అలీ లారిజానీ..
అలీ లారిజానీ.. అయతుల్లా అలీ ఖమేనీకి కుడిభుజం లాంటివాడు. దేశ భద్రత, ఇరాన్ అణు కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారు. సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ది కల్చరల్ రివల్యూషన్‌లోనూ సభ్యుడిగా ఉన్నారు. అలీ ఖమేనీ మరణానంతరం లారిజానీని ఇరాన్‌లో శక్తిమంతమైన నేతగా అంతర్జాతీయ కథనాలు చెబుతున్నాయి.
Also Read
- Israel vs Hamas: అక్టోబర్ 7 రహస్యం! ఆ 10 రోజుల్లో ఏం జరిగింది?
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
- China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
ఇది కూడా చదవండి: Petrol-Diesel: వాహనదారులకు ఊరట.. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం కీలక ప్రకటన
శుక్రవారం టెహ్రాన్‌లో జరిగిన ఖుద్స్ డే ర్యాలీల సందర్భంగా అలీ లారిజాని చివరిసారిగా బహిరంగంగా కనిపించారు. అనంతరం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌తో సంబంధం ఉన్న 10 మంది వ్యక్తుల జాబితాలో భాగంగా లారిజానీతో సహా సీనియర్ ఇరాన్ సైనిక, గూఢచార అధికారుల గురించిన సమాచారం కోసం అమెరికా 10 మిలియన్ డాలర్ల వరకు బహుమతిని ప్రకటించింది. అలా అమెరికా రివార్డ్ ప్రకటించిన కొద్దిరోజులకే ఇజ్రాయెల్ హతమార్చేసింది.
Israel Defense Forces tweets, "Ali Larijani, Secretary of Iran’s Supreme National Security Council and the regime’s effective leader, has been eliminated." pic.twitter.com/KtSO4ZnN1d
— ANI (@ANI) March 17, 2026
"Eliminated": Israeli Defence Forces confirm death of senior Iran military chief Soleimani
Read @ANI Story | https://t.co/fIQAEdtbgQ#Israel #Iran #Soleimani pic.twitter.com/aIjUwlUNMS
— ANI Digital (@ani_digital) March 17, 2026
తాజావార్తలు
-
Bipasha Basu: ప్రొటీన్ పౌడర్‌లో పురుగులు.. ‘మీరే మా ఏకైక ఆశ’ అంటూ ఐఏఎస్ అధికారికి బిపాషా బసు ఫిర్యాదు!
-
IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
Jowar Roti to Ragi Roti: రొట్టెల్లో వెరైటీ కావాలా?.. జొన్న నుంచి రాగి వరకు.. ఆరోగ్యకరమైన 6 రకాల రొట్టెలు ఇవే!
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
ట్రెండింగ్
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!