Titanic Submersible: సముద్రగర్భంలో “టైటానిక్ సబ్మెర్సిబుల్” విషాదం.. పేలుడు క్షణాల ఆడియో వైరల్..
- సముద్రగర్భంలో టైటానిక్ సబ్మెర్సిబుల్ ఇంప్లోషన్..
- పేలుడు క్షణాల ఆడియో రికార్డ్..
- టైటానికి శిథిలాలను చూసేందుకు వెళ్లే సమయంలో ఘటన..
- ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు..
Titanic Submersible: సముద్ర గర్భంలో దాగున్న టైటానిక్ ఓడ శిథిలాలను చూడటానికి వెళ్లిన ‘‘టైటాన్ సబ్మెర్సిబుల్’’ విషాదాన్ని ఎవరూ మరిచిపోలేరు. సముద్ర గర్భంలోకి వెళ్లిన కొద్ది నిమిషాల లోపే ఈ టైటాన్ క్యాప్సూ్ల్,సముద్ర నీటి ఒత్తిడిని తట్టుకోలేక ఇంప్లోడ్ అయింది. 2023లో జరిగిన ఈ విషాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రఖ్యాత బ్రిటిష్ సాహసికుడు హమీష్ హార్డింగ్, యూకేకి చెందిన తండ్రి కొడుకులు షాజాదా, సులేమాన్ దావూద్, ఫ్రెంచ్ జాతీయుడు పాల్-హెన్రీ నార్జియోలెట్,ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్ CEO స్టాక్టన్ రష్ ప్రాణాలు కోల్పోయారు. తాము చనిపోతున్నామనే విషయం తెలియకుండానే చనిపోయారు. అంతా క్షణాల్లో ప్రమాదం జరిగిపోయింది.
Read Also: Noise Master Buds: మార్కెట్లోకి నాయిస్ మాస్టర్ బడ్స్.. లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్.. ధర ఎంతంటే?
Also Read
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
- Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్‌పై ట్రంప్ ఆగ్రహం
- Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
- Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఆరోగ్యంపై సస్పెన్స్ వీడినట్టేనా!? కుడ్యచిత్రం ఆవిష్కరణ
ఇదెలా ఉంటే, ఈ భారీ పేలుడుకు సంబంధించిన ఆడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఆడియోని విడుదల చేసింది. డిఫెన్స్ విజువల్ ఇన్ఫర్మెషన్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్(DVIDS) శుక్రవారం దీనిని విడుదల చేసింది. 20 సెకన్ల పాటు విస్పోటనానికి సంబంధిచిన శబ్ధాలు ఇందులో వినవచ్చు. జూన్ 18, 2023న ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం అడుగున ఉన్న టైటానిక్ శిథిలాన్ని చేరుకోవడానికి ముందు జలాంతర్గామి పేలిపోయిన శబ్దం అని అధికారులు చెప్పారు.
న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. ఓషన్ గేట్ సంస్థకు చెందిన ఈ టైటాన్ సబ్మెర్సిబుల్ నీటి పీడనం తట్టుకోలేక విస్పోటనం చెందింది. ఈ ఘటన జరిగిన ప్రాంతం నుంచి 900 మైళ్ల దూరంలోని లంగర వేసిన పాసివ్ అకౌస్టిక్ ద్వారా ఈ ప్రమాద శబ్ధాలు రికార్డ్ అయ్యాయి. ఇది టైటాన్ ఇంప్లోజన్ అనుమానిత శబ్ధాన్ని వెల్లడిస్తుందని యూఎస్ కోస్ట్‌గార్డ్ తెలిపింది. ఈ పేలుడు తర్వాత టైటాన్ క్యాప్సూల్ శిథిలాలను వెలికి తీశారు. మృతులకు సంబంధించిన కొన్ని రక్తపు, మాంసపు ముద్దలు తప్పితే ఏమీ మిగలలేదు. నాలుగు రోజుల తర్వాత నీటి అడుగు నుంచి శిథిలాలను యూఎస్ కోస్ట్ గార్డ్ స్వాధీనం చేసుకుంది.
The #TitanMBI releases the suspected acoustic signature of the Titan submersible implosion. Audio recording courtesy of NOAA/NPS Ocean Noise Reference Station Network) https://t.co/h3ySH0PhiA pic.twitter.com/dXC7C1hy4y
— USCG MaritimeCommons (@maritimecommons) February 8, 2025
తాజావార్తలు
-
Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
-
Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
-
Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
-
Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
-
Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!