NTV Telugu Site icon

Donald Trump: కాలేజీల నుంచి రాడికల్ లెఫ్ట్, ఉన్మాదుల్ని తొలగిస్తా.. ట్రంప్ సంచలనం..

Donald Trump

Donald Trump

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో ఆ దేశంలో పాటు ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముక్యంగా రాడికల్ లెఫ్ట్ లిబరల్స్‌పై ట్రంప్ ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికాలోని విద్యా సంస్థల్లో రాడికల్ లెఫ్ట్‌‌ని తరిమికొట్టే సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు అక్రిడేషన్ వ్యవస్థనను ఉపయోగిస్తానని అన్నారు. వచ్చే ఏడాది జనవరి 20న అధ్యక్ష పదవి చేపట్టగానే కాలజీల్లో ‘‘మార్క్సిస్టులు, ఉన్మాదులను తొలగిచేందుకు రాడికల్ లెఫ్ట్ అక్రిడిటర్లను ట్రంప్ తొలగిస్తారని ఆయన అన్నారు.

Read Also: TFCC : ఘనంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం

ట్రంప్‌కి సంబంధించిన వీడియోని స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ పంచుకున్నారు. రిపబ్లికన్ తన పరిపాలన కొత్త అక్రిడిటర్లను నియమిస్తుందని చెప్పారు. కష్టపడి పనిచేసి అమెరికన్ల నుంచి వందల బిలియన్ డాలర్లతో నడిచే విద్యా సంస్థలు ‘‘అమెరికన్ వ్యతిరేక పిచ్చితనం’’ నుంచి బయటపడటానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. జాతి వివక్షకు పాల్పడుతున్న పాఠశాలలపై ఫెడరల్ పౌర హక్కుల కేసులను కొనసాగించాలని న్యాయ శాఖను తాను నిర్దేశిస్తానని ట్రంప్ అన్నారు. ‘‘సమానత్వం’’ ముసుగులో చట్టవిరుద్ధమైన వివక్షకు పాల్పడే స్కూల్స్‌పై జరిమానా విధించేందుకు, జరిమానా విధించే చట్టాలను తీసుకువస్తానని చెప్పారు.

‘‘లింగమార్పిడి పిచ్చితనం’’ బోధించే ఏ పాఠశాలకైనా నిధులను తగ్గించాలని, ‘‘దేశభక్తి విలువలను’’ స్వీకరించి అమెరికన్ జీవన విధానాన్ని సమర్థించే ఉపాధ్యాయులకు క్రెడెన్షియల్‌ని అందించాలని ప్రతిపాధించారు. హార్వర్డ్, న్యూయార్క్ యూనివర్శిటీ, యేల్, ఎమర్సన్ కాలేజ్ మరియు మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో సహా పాలస్తీనా అనుకూల, ఇజ్రాయిల్ వ్యతిరేక ఉద్యమాలు ఎగిసి పడిన సందర్భంగా ట్రంప్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.

Show comments