Site icon NTV Telugu

Indonesia: మాదకద్రవ్యాల కేసులో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష

Indonesia

Indonesia

ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష పడింది. 106 కిలోల మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసిన కేసులో ముగ్గురు భారతీయులకు న్యాయస్థానం మరణశిక్ష విధించింది. మరణశిక్షపై కేంద్రం తక్షణమే స్పందించాలని ఢిల్లీ హైకోర్టులో ముగ్గురు వ్యక్తుల జీవిత భాగస్వాములు పిటిషన్ దాఖలు చేశారు. మరణశిక్ష పడిన వారిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఇండోనేషియా కోర్టు తీర్పు కాపీని ఏప్రిల్ 29న పిటిషనర్లు అందుకున్నారని, ఈ కేసు మే 6న విచారణకు వస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Nani: ది ప్యారడైజ్‌లోకి అడుగు పెట్టేది అప్పుడే!

లెజెండ్ అక్వేరియస్ కార్గో నౌకలో 106 కిలోగ్రాముల క్రిస్టల్ మెత్‌ను అక్రమంగా రవాణా చేశారనే ఆరోపణలతో గత ఏడాది జూలైలో తమిళనాడుకు చెందిన రాజు ముత్తుకుమరన్, సెల్వదురై దినకరన్, గోవిందసామి విమల్కందన్ అనే ముగ్గురు వ్యక్తులు అరెస్టు అయ్యారు. తాజాగా ఈ కేసులో ఇండోనేషియాలో మరణశిక్ష విధించబడింది. మాదకద్రవ్యాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఇండోనేషియాలోని జిల్లా కోర్టు గత నెలలో ముగ్గురికి మరణశిక్ష విధించింది.

ఇది కూడా చదవండి: Army Jobs: ఫేక్ సర్టిఫికెట్లతో ఆర్మీ ఉద్యోగాలు.. కొనసాగుతున్న విచారణ..

పిటిషన్ విచారించిన ఢిల్లీ హైకోర్టు.. మరణశిక్ష పడిన ముగ్గురు భారతీయులకు సాయం చేయాలంటూ ఇండోనేషియాలోని భారత కాన్సులేట్‌ను ఢిల్లీ ధర్మాసనం కోరింది. తగిన న్యాయ సహాయం అందేలా చూడాలని కోరిందని నివేదిక పేర్కొంది. దోషులుగా తేలిన భారతీయుల జీవిత భాగస్వాములు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ నోటీసు జారీ చేసింది. ఈ విషయాన్ని దౌత్య స్థాయిలో కొనసాగించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. అలాగే దోషులు-వారి కుటుంబాల మధ్య కమ్యూనికేషన్‌ను కూడా సులభతరం చేయాలని కోర్టు అధికారులను కోరిందని నివేదిక పేర్కొంది.

Exit mobile version