Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News There May Be A Poison Experiment On Prigogine Us President Joe Biden

Joe Biden: ప్రిగోజిన్‌పై విష ప్రయోగం జరగొచ్చు.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌

Published Date :July 15, 2023 , 1:15 pm
By Naga Maneendra
Joe Biden: ప్రిగోజిన్‌పై విష ప్రయోగం జరగొచ్చు.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

Joe Biden: ప్రిగోజిన్‌పై అమెరికా అధ్యక్షులు జొ బైడెన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనపై విష ప్రయోగం జరిగే అవకాశం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాగ్నర్ బాస్‌ ప్రిగోజిన్‌ ఇటీవల.. రష్యా సైనిక నాయకత్వంపై తిరుగుబాటు చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్‌ భవితవ్యంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తనదైన శైలిలో స్పందించారు. ఆయనపై విషప్రయోగం జరగొచ్చేమోనంటూ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రిగోజిన్‌(Prigozhin) చేసిన తిరుగుబాటు, ఆ తర్వాత పరిణామాలను ఉద్దేశించి బైడెన్ ఈ విధంగా స్పందించినట్టు తెలుస్తోంది. ‘ప్రిగోజిన్ ఎక్కడున్నారో అమెరికాకు తెలీదు. అతడి స్థానంలో నేనుంటే.. నేను తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉంటాను. నా మెనూపై ఓ కన్నేసి ఉంచుతాను’ అంటూ ప్రిగోజిన్‌పై విష ప్రయోగం జరగొచ్చేమోనన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. ‘ఇక సరదా మాటలన్నీ పక్కన పెడితే.. రష్యాలో ప్రిగోజిన్ భవిష్యత్తు ఏంటో ఎవరికీ కచ్చితంగా తెలీదని నేను భావిస్తున్నాను’ అని అన్నారు.

Read also: Robbery in Jagtial: మీ కక్కుర్తి పాడుగాను.. ఇలా కూడా దొంగతనం చేస్తారా..!

రష్యా సైన్యంతో కలిసి ఉక్రెయిన్‌ యద్ధంలో పోరాడుతోన్న వాగ్నర్‌ గ్రూప్.. జూన్‌ 24న తిరుగుబాటుకు దిగిన విషయం తెలిసిందే. దానిలో భాగంగా రొస్తోవ్‌-ఆన్‌-డాన్‌ నగరంలోని రష్యా సైనిక కార్యాలయాన్ని ఆధీనంలోకి తీసుకుంది. మాస్కోలోని సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బెలారస్‌ అధ్యక్షుడు లుకషెంకో మధ్యవర్తిత్వంతో ఈ తిరుగుబాటు ఆగిపోయింది. దీని తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్‌- ప్రిగోజిన్ మధ్య చర్చలు జరిగాయి. తర్వాత పుతిన్ ఓ పత్రికతో మాట్లాడుతూ.. ‘వాగ్నర్‌ పీఎంసీ అనేది లేదు. మా చట్టాలు ప్రైవేటు సైన్యాలకు అనుమతి ఇవ్వవు. వాస్తవానికి వాగ్నర్‌ గ్రూపు ఉంది. కానీ చట్టం దృష్టిలో మాత్రం అటువంటి సంస్థ లేదు. దీనిని చట్టపరం చేయడం ఓ ప్రత్యేకమైన విషయం. ఆ విషయాన్ని స్టేట్‌ డూమా చర్చించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే వాగ్నర్ బాధ్యతల నుంచి ప్రిగోజిన్‌ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ప్రిగోజిన్‌పై విష ప్రయోగం జరగొచ్చని గతంలోనూ ఊహాగానాలు వినిపించాయి. ఆ మధ్య పుతిన్‌ను ఎదిరించిన ప్రతిపక్ష నేత అలెక్సీ నవానీ సహా కొందరిపై విషప్రయోగం జరిగినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే బైడెన్ ఈ విధంగా స్పందించారని భావించాల్సి వస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • america
  • Joe Biden
  • Poison Experiment
  • Prigozhin
  • Russia

తాజావార్తలు

  • Sarfaraz Khan విధ్వంసం.. Virat Kohli అభినందన.. వీడియో వైరల్.!

  • BSNL Rs.1 Plan: రూ.1 ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్.. ఆఫర్ అదిరిపోయిందిగా.. నెల రోజుల పాటు ఫ్రీ..

  • Dhurandhar 2 : దురంధర్ 2 కలెక్షన్ల ఊచకోత.!

  • Delhi: ఢిల్లీ అసెంబ్లీ గేట్లు బద్దలుకొట్టి, దూసుకెళ్లిన కారు.. అతిపెద్ద భద్రతా వైఫల్యం..

  • Krithi Shetty: నందమూరి హీరోతో కృతి శెట్టి రొమాన్స్.. అనిల్ రావిపూడి క్లారిటీ ఇదే!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions