Site icon NTV Telugu

ఆప్ఘాన్‌కు సాయం చేయండి: ఆప్ఘన్‌ ప్రధాని విజ్ఞప్తి

గత ఆగస్టులో తాలిబాన్‌ల వశం అయిన ఆప్ఘన్‌ తీవ్ర సమస్యలతో సతమతమవుతుంది. ప్రపంచ దేశాలు ఆప్ఘన్‌నుకు సాయాన్ని నిలిపి వేయడంతో అక్కడి తాలిబాన్‌ ప్రభుత్వం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌కు సహాయం చేయాలని ప్రపంచ దేశాలకు తాలిబాన్‌ సహ వ్యవస్థాపకులు, ప్రసుత్త ప్రధాని ముల్లార్‌ మహమ్మద్‌ హస్సాన్‌ అఖుండ్‌ విజ్ఞప్తి చేశారు. ఆగస్టులో అధికారంలోకి వచ్చాక తొలిసారి చేసిన టెలివిజన్‌ ప్రసంగంలోనే ఆయన ఈ విజ్ఞప్తి చేయడం విశేషం. ఈ ప్రసంగంలో ‘అన్ని దేశాలకు వాటి అంతర్జాతీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని మేం హామీ ఇస్తున్నాం. ప్రపంచ దేశాలతో మంచి ఆర్థిక సంబంధాలను మేం కోరుకుంటున్నాం’ అని తెలిపారు.

తమ సహాయాన్ని నిలిపివేయొద్దని ప్రపంచంలోని అన్ని చారిటీ సంస్థలను కోరారు. అన్‌లాక్‌ చేసిన 10 బిలియన్‌ డాలర్ల నిధులను విడుదల చేయాలని అమెరికాకు విజ్ఞప్తి చేశారు. వచ్చే వారం కతార్‌ రాజధాని దోహాలో తాలిబన్లకు, అమెరికాకు మధ్య చర్చలు జరగనున్నాయి. కాగా ప్రపంచ వ్యాప్తంగా తాలిబాన్‌ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అక్కడి ప్రజలు తాలిబాన్ల పాలనలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. కానీ అక్కడి ప్రభుత్వం మాత్రం అలాంటిది ఏం లేదని తాము ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతున్నామని బుకాయిస్తుండటం గమనార్హం.

Exit mobile version