NTV Telugu Site icon

Spain Royal Baby Long Name: పేరులో 157 అక్షరాలు.. రిజిస్టర్ చేయలేమని చేతులెత్తేసిన అధికారులు..

Untitled 3

Untitled 3

Spain Royal Baby Long Name: ఒకప్పుడు పుట్టిన బిడ్డకు పురిట్లోనే పేరు పెట్టేవారు. ఎక్కువగా దేవుని పేర్లు కలిసి వచ్చేలా పెట్టేవారు. లక్ష్మి, సీత, సరస్వతి, శంకర్, ఇలా ఎవరి మతానికి తగ్గట్టు వాళ్ళు పేర్లు పెట్టేవాళ్ళు. అయితే ప్రస్తుతం కాలం మారింది.. పిల్లల పేర్లు వెరైటీగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అలానే ఆ పేర్లు స్వీట్ అండ్ షార్ట్ గా ఉండేలా వింత వింత పేర్లు పెడుతున్నారు. అయితే బిడ్డకు ఏ పేరు పెట్టిన ఆ బిడ్డను పేరును రిజిస్టర్ చేయించుకోవాలి. ఈ నేపథ్యంలో ఓ తల్లిదండ్రులు తమ పాప పేరును రిజిస్టర్ చేయమని అధికారులను కోరారు. అయితే ఆ ప్రభుత్వ అధికారులు ఆ పాప పేరును రిజస్టర్ చేయలేము అంటూ చేతులు ఎత్తేసారు.

Read also:Nizamabad: అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య… అదనపు కట్నం కోసమేనా?

ఈ వింత ఘటన స్పెయిన్ లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళ్తే.. ఇంగ్లండ్ రాజు జేమ్స్ II వారసులు స్పెయిన్ లో ఉన్నారు. ఆల్బా రాజ్య వారసుడు 17వ హ్యూస్కర్‌ డ్యూక్‌ ఫెర్నాండో ఫిట్జ్‌-జేమ్స్‌ స్టువర్ట్ సోఫియా దంపతులకు ఇటీవల పాప పుట్టింది.ఈ నేపథ్యంలో ఆ దంపతులు వాళ్ళ పాపకు అత్యంత భారీ పేరును పెట్టారు. ఈ పేరులో 25 పదాలు ఉన్నాయి. అలానే ఏకంగా 157 అక్షరాలతో ఉన్న ఈ పేరు రెండు వరుసల పొడవు వుంది. ఈ నేపథ్యంలో దంపతులు వాళ్ళ పాప పేరును రిజిస్టర్ చేయించుకోవాలని ప్రభుత్వ అధికాఆరులను సంప్రదించారు.

Read also:Hyderabad: అలెర్ట్.. నగరంలో మంజీరా వాటర్ బంద్..

అయితే అంత పెద్ద పేరును రిజస్టర్ చేయలేము అని ప్రభుత్వ అధికారులు తేల్చి చెప్పేసారు. ఇంతకీ ఆ పేరు ఏంటా అని లోచిస్తున్నారా.. “సోఫియా ఫెర్నాండా డొలొరెస్‌ కయెటనా టెరెసా ఏంజెలా డీ లా క్రుజ్‌ మికేలా డెల్‌ శాంటిసిమో సక్రామెంటో డెల్‌ పర్పెటువో సొకొర్రో డీ లా శాంటిసిమా ట్రినిడాడ్‌ వై డీ టొడొస్‌ లాస్‌ సాంటోస్‌” Sofía Fernanda Dolores Cayetana Teresa Ángela de la Cruz Micaela del Santísimo Sacramento del Perpetuo Socorro de la Santísima Trinidad y de Todos Los Santos ఇదే ఆ పేరు. ఈ పేరులో 25 పదాలు ఉన్నాయి. అలానే ఆంగ్లంలో రాసినప్పుడు 157 అక్షరాలు ఉన్నాయి.