NTV Telugu Site icon

Tesla Showroom In Delhi: ఢిల్లీలో టెస్లా కార్ల షోరూం.. అనువైన స్థలం కోసం సెర్చ్!

Tesla

Tesla

Tesla Showroom In Delhi: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టెస్లా త్వరలోనే భారత్ లో అడుగు పెట్టబోతుంది. ఢిల్లీలో షోరూం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే, త్వరలో ఢిల్లీ రోడ్లపై టెస్లా కార్లు పరుగులు పెట్టే అవకాశం ఉంది. షోరూం ఏర్పాటుకు అనువైన స్థలం కోసం మస్క్ కంపెనీ టెస్లా ఢిల్లీలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలతో సంప్రదింపులు చేస్తుందని టాక్. ఈ మేరకు జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేస్తోంది. అయితే, 100 శాతం పన్ను చెల్లించి కార్లను దిగుమతి చేసి అమ్ముతుందా? లేక భారత్ లో పెట్టుబడులకు హామీ ఇచ్చి కొత్త విధానం ప్రకారం 15 శాతం పన్ను చెల్లించి దిగుమతి చేస్తుందా? అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు.

Read Also: V Srinivasa Rao: ఆంధ్రప్రదేశ్‌ను అధానాంద్రప్రదేశ్‌గా మార్చొద్దు: వీఎస్సార్‌

కాగా, షోరూం ఏర్పాటు ఇంకా తొలి దశలోనే ఉంది. 3 వేల నుంచి 5 వేల చదరపు మీటర్ల స్థలం కోసం టెస్లా కంపెనీ సెర్చ్ చేస్తున్నట్లు సమాచారం. కన్జ్యూమర్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను, దీనికి మూడురెట్ల స్థలంలో డెలివరీ, సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని టెస్లా నిర్ణయించినట్లు సమాచారం. సౌత్ ఢిల్లీలోని డీఎల్‌ఎఫ్‌ అవెన్యూ మాల్‌, సైబర్‌ హబ్‌ ఆఫీస్‌, గురుగ్రామ్‌లోని ఓ రిటైల్‌ కాంప్లెక్స్‌ లను టెస్లా ప్రతినిధులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.

Read Also: Google Search : ఇంటర్నేషనల్ లెవల్లో హవా చూపిస్తున్న పవన్ కళ్యాణ్

అయితే, భారత్ లో ఎలాన్ మస్క్ రూ.25 వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నాడని ఈ ఏడాది ప్రారంభంలో వార్తలు వచ్చాయి. భారతదేశంలో పర్యటించి ప్రధాని మోడీని కలుస్తానని స్వయంగా మస్క్ మీడియాకు తెలిపారు. కానీ, ఆ తర్వాత టెస్లా అమ్మకాలు పడిపోవడంతో భారత్ లో పెట్టుబడుల ప్రణాళికను ఆ కంపెనీ ఆపేసింది. తాజాగా, ఢిల్లీలో షోరూం ఏర్పాటు కోసం స్థలం టెస్లా కంపెనీ చూస్తుంది.

Show comments