NTV Telugu Site icon

Tesla Cars: “టెస్లా” లక్ష్యంగా అమెరికాలో దాడులు.. లాస్ వేగాస్‌లో కార్లకు నిప్పు..

Tesla

Tesla

Tesla Cars: అమెరికాలో ఎలాన్ మస్క్‌కి చెందిన టెస్లా కంపెనీ కొందరు టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా, లాస్ వేగాస్‌లో టెస్లా కార్లపై దాడులు చేసి తగలబెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. సీఎన్ఎన్ నివేదిక ప్రకారం.. రాత్రిపూట లాస్ వేగాస్ స్వీస్ సెంటర్‌లో టెస్లా వాహనాలకు నిప్పంటించారు. ఈ ఘటనలో చాలా కార్లు తగలబడిపోయినట్లు తెలుస్తోంది. టెస్లా కొలిషన్ సెంటర్‌లో జరిగిన దాడిలో కనీసం 5 కార్‌లు దెబ్బతిన్నాయి. ఈ సంఘటనపై ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోంది. ఉగ్రవాదనికి సంబంధించిన లక్షణాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

Read Also: Sunita Williams: సునీతా విలియమ్స్‌కు స్వాగతం పలికిన అందమైన సముద్ర జీవులు.. (వీడియో)

అధికారుల ప్రకారం.. నేరస్తుడు మోలోటోవ్ కాక్‌టెయిల్స్‌ని ఉపయోగించి, వాహనాలకు నిప్పటించినట్లు తెలుస్తోంది. బిజినెస్ సెంటర్ ముందు తలుపులపై ‘‘రెసిస్ట్’’ అనే పదాన్ని కూడా రాశాడు. ఎఫ్‌బీఐ జాయింట్ టెర్రరిజం టాస్క్ ఫోర్స్ , లాస్ వెగాస్ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ కలిసి నేరస్థుడిని గుర్తించడానికి పనిచేస్తున్నాయి. నిందితుడు పూర్తిగా నల్లటి బట్టలు ధరించి, కార్ల మధ్యలో నడుస్తున్నట్లు గుర్తించారు. మంటలు వాహనాల బ్యాటరీలను చేరుకునే లోపే ఫైర్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకోవడంతో పెద్ద ముప్పు తప్పింది.

ఈ ఘటనను ‘‘ఉగ్రవాదం’’గా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పిలిచారు. ఈ హింసాత్మక సంఘటన చాలా తప్పు అని అన్నారు. టెస్లా కేవలం ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తుంది, ఈ దుష్ట దాడులకు అర్హమైనవి కావు అని అన్నారు. మరోవైపు, టెస్లా ఫెసిలిటీలను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేయడాన్ని దేశీయ ఉగ్రవాదంగా వర్గీకరించాలని అధ్యక్షుడు ట్రంప్‌ కోరారు. అమెరికా అటార్నీ జనరల్ పమేలా బోండీ ఈ దాడుల్ని తీవ్రంగా ఖండించారు. ఇవి దేశీయ ఉగ్రవాదం కన్నా తక్కువ కాదని అభివర్ణించారు.