Afghanistan: మహిళా ఉద్యోగులపై నిషేధం.. తాలిబాన్ పాలకుల తాజా ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taliban Bans Women From Working In NGOs: మహిళల స్వేచ్ఛపై మరోసారి తాలిబాన్ పాలకులు ఉక్కుపాదం మోపారు. ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం చేపట్టినప్పటి నుంచి తాలిబాన్లు మహిళలపై ఆంక్షలు విధిస్తూనే వస్తున్నారు. మహిళలను వంటింటికే పరిమితం చేశారు. బయటకు వెళ్లాలన్నా పూర్తిగా హిజాబ్ ధరించి, కుటుంబంలోని మగవారిని తోడు తీసుకెళ్లాలనే నియమాలను విధించారు. ఇదిలా ఉంటే మరోసారి మహిళలపై ఆంక్షలు విధించింది అక్కడి తాలిబాన్ గవర్నమెంట్.
Read Also: Jammu Kashmir: పాకిస్తాన్ ఉగ్రకుట్ర భగ్నం.. భారీగా ఆయుధాలు స్వాధీనం..
Also Read
- Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్‌ను వీడనున్న కింగ్ చార్లెస్!
- China-Pakistan: పాకిస్తాన్‌తో సంబంధాలకే చైనా ప్రాధాన్యం: జిన్‌పింగ్.
- France: ఫ్రాన్స్‌లో ఎండలు భగభగ.. ఏసీల కోసం ఎగబడ్డ జనాలు
- Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు
దేశ, విదేశీ ప్రభుత్వేతర సంస్థలు(ఎన్జీవో)ల్లో మహిళ ఉద్యోగులు పనులకు రాకుండా ఆపాలని తాలిబాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. ఎన్జీవోల్లో మహిళలపై నిషేధం విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మహిళ ఉద్యోగులను పనిలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవ చేస్తున్న ఐక్యరాజ్య సమితి ఏజెన్సీలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయో లేదో స్పష్టంగా తెలియజేయలేదు.
ఇప్పటికే ఆఫ్ఘన్ వ్యాప్తంగా మహిళా విద్యార్థినులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు యూనివర్సిటీల్లో మహిళల విద్యను నిషేధిస్తూ ఇటీవల తాలిబాన్లు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాలిబాన్లు తీసుకున్న ఈ నిర్ణయంపై భారత్ తో పాటు పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మహిళల విద్యపై ఈ నిర్ణయం తీసుకున్న కొన్ని రోజుల్లోనే ఎన్జీవోల్లో పనిచేసే మహిళ ఉద్యోగులపై బ్యాన్ విధించారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్‌పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!