NTV Telugu Site icon

Syria: సైన్యం పరార్.. తిరుగుబాటుదారుల చేతుల్లోకి రాజధాని డమాస్కస్!

Damascus

Damascus

సిరియా తిరుగుబాటుదారుల హస్తగతం కాబోతుంది. ఇప్పటికే పలు నగరాలు స్వాధీనం చేసుకున్న రెబల్స్.. మరికొన్ని నిమిషాల్లోనే రాజధాని డమాస్కస్‌ను కూడా స్వాధీనం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. డమాస్కస్‌కు 20 కిలోమీటర్ల దూరంలోనే తిరుగుబాటుదారులు ఉన్నారు. రాజధానిని చుట్టుముట్టడం ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు నగరం సమీపంలో ఉన్న సైన్యం పారిపోయినట్లు సమాచారం. అయితే ఈ వార్తలను సిరియా రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. డమాస్కస్‌లో సాయుధ బలగాలు ఉపసంహరించుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది.

ఇది కూడా చదవండి: S Jaishankar: “బ్రిక్స్ కరెన్సీ ప్రతిపాదన లేదు”.. ట్రంప్ వార్నింగ్‌ తర్వాత జైశంకర్ ప్రకటన..

హయత్ తహ్రీర్ అల్-షామ్ గ్రూపు నేతృత్వంలోని ఇస్లామిస్ట్ నేతృత్వంలోని సంకీర్ణం.. రాజధానిని ఆక్రమించుకోబోతున్నట్లు ప్రకటించింది. రాజధాని డమాస్కస్‌ను చుట్టుముట్టడం ప్రారంభించినట్లు సిరియన్ తిరుగుబాటుదారులు పేర్కొన్నారు. తిరుగుబాటుదారులు శనివారం రాజధాని డమాస్కస్‌ను చుట్టుముట్టే చివరి దశలో ఉన్నారని పేర్కొన్నారు. అయితే బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వ దళాలు నగరానికి సమీపంలో ఉన్న ప్రాంతాల నుంచి ఎటువంటి ఉపసంహరణ జరగలేదని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Bangladesh: పాకిస్తాన్‌ కోసం బంగ్లాదేశ్ కీలక నిర్ణయం.. భారత్‌కి సెక్యూరిటీ సమస్య..

సిరియాలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా భారత పౌరులెవరూ వెళ్లొద్దని ఎంబసీ తెలిపింది. తదుపరి నోటిఫికేషన్‌ జారీ చేసేవరకు ఆ దేశానికి వెళ్లొద్దని సూచిస్తున్నట్లు పేర్కొంది. భారతీయులు అందుబాటులో ఉన్న విమానాలు, ఇతర రవాణా మార్గాలను ఉపయోగించుకొని వీలైనంత త్వరగా ఆ దేశాన్ని వీడాలని చెప్పింది. అత్యవసర పరిస్థితుల్లో డమాస్కస్‌లోని ఇండియన్‌ ఎంబసీతో టచ్‌లో ఉండాలని తెలిపింది. సిరియాలో ప్రయాణించేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఇది కూడా చదవండి: UP: వామ్మో.. వాడు తప్పిపోయిన కొడుకు కాదు.. బయటపడ్డ నిజస్వరూపం

Show comments