సిరియా అధ్యక్షుడు అసద్ భవిష్యత్‌ను ముందే ఊహించినట్లుగా తెలుస్తోంది. ముందు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చక్కబెట్టుకున్నట్లు సమాచారం. తాజాగా అతడి అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇటీవల తిరుగుబాటుదారుల చేతిలో సిరియా అధ్యక్షుడు అసద్ పదవీచ్యుతుడయ్యాడు. సిరియా నుంచి రష్యాకు పారిపోయాడు. అయితే ముందుగానే అసద్ భారీగా నగదు తరలించినట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. విమానాల్లో కట్టల కట్టల డబ్బు మాస్కోకు తరలించినట్లుగా ఫైనాన్షియల్ టైమ్స్ వార్తా కథనం పేర్కొంది. దాదాపు పారిపోయే ముందు రూ.2,122 కోట్ల నగదును విమానంలో తీసుకెళ్లినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది.
ఇది కూడా చదవండి: Minister Komatireddy: అందుకే కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేరు.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
బషర్ అల్-అసద్.. మాస్కోకు $250 మిలియన్లు (రూ.2,122 కోట్లకు పైగా) నగదును విమానంలో తీసుకెళ్లారని ఎఫ్‌టీ నివేదించింది. 2018, 2019లో దాదాపు రెండు టన్నుల $100 మరియు €500 కరెన్సీ నోట్లతో 21 విమానాలను పంపినట్లు వెల్లడించింది. మాస్కోకు నగదు చేరాక.. అస్సాద్ బంధువులు రష్యాలో రహస్యంగా విలాసవంతమైన ఆస్తులను కొనుగోలు చేసినట్లు ఎఫ్‌టీ స్పష్టం చేసింది.
2011లో సిరియాలో అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా అస్సాద్‌కి ఆయువుపట్టుగా మారిందని తెలిపింది. అంతేకాకుండా అసద్‌కు రష్యా దళాలు సంపూర్ణ మద్దతు తెలిపినట్లుగా తెలుస్తోంది. 2000లో తండ్రి హఫీజ్ అల్ అసద్ మరణించినప్పటి నుంచి.. సిరియా దేశాన్ని కుమారుడు బషర్ అల్ అసద్ పాలిస్తు్నాడు. ఇక అధ్యక్షుడు అయ్యాక 2011 నుంచి అంతర్యుద్ధం ఉన్నప్పటికీ అధికారాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు. అయితే నవంబర్‌లో తిరుగుబాటుదారులు తీవ్రంగా విజృంభించారు. దీంతో అసద్ చేతులెత్తేశాడు. అంతేకాకుండా మిత్ర దేశాలు కూడా సహాయం చేయలేదు. దీంతో చేసేదేమీలేక అసద్ రష్యాకు పారిపోయాడు. ప్రస్తుతం అసద్ రాజకీయ శరణార్థిగా రష్యాలో ఉంటున్నారు.
ఇది కూడా చదవండి: Ambati Rambabu: సీఎం వ్యాఖ్యలకు అంబటి కౌంటర్ ఎటాక్.. దీనికి బాధ్యుడు చంద్రబాబే..!