సిరియా తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇక సిరియా అధ్యక్షుడు అసద్.. రష్యాకు రాజకీయ శరణార్థిగా వెళ్లిపోయారు. డమాస్కస్‌ను రెబల్స్ పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. అయితే తాజాగా పశ్చిమాసియాలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. రష్యా మిత్ర దేశమైన సిరియాతో ఉక్రెయిన్ సత్సంబంధాలు బలపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇరుదేశాల మధ్య చర్చలు జరిగినట్లుగా సిరియా స్థానిక మీడియా పేర్కొంది.
ఇది కూడా చదవండి: Tummala Nageswara Rao: రేవంత్ ప్రభుత్వంలో అభివృద్ధిలో దూసుకెళ్తున్నాం..
సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్-షరాతో ఉక్రెయిన్ విదేశాంగమంత్రి సిబిహ ఆంద్రీ చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఇరుదేశాల సంబంధాల బలోపేతంపై చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గత వారం మానవతా సాయంలో భాగంగా ఉక్రెయిన్ నుంచి ఆహార పదార్థాలు కూడా సిరియాకు సరఫరా చేశారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. సిరియాకు 500 మెట్రిక్ టన్నుల గోధుమలను పంపించినట్లు జెలెన్‌స్కీ తెలిపారు. రాజకీయ సంక్షోభం నెలకొనడంతో సిరియాలో ఆహార కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో మానవతా సాయంలో భాగంగా ఆహార ధాన్యాలు సిరియాకు పంపించింది.
ఇది కూడా చదవండి: Manish Sisodia: ఎన్నికల్లో పోటీ చేస్తున్నా ఆర్థిక సాయం చేయండి.. ప్రజలకు సిసోడియా విజ్ఞప్తి
సిరియా తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిపోయాక.. ఉక్రెయిన్ కొత్త స్నేహాన్ని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. తిరుగుబాటుదారులు.. ఆక్రమించుకునే సమయంలో అప్పటి అధ్యక్షుడు అసద్‌కు ఇరాన్ గానీ.. రష్యా గానీ ఏ మాత్రం సహకరించలేదు. కష్టసమయంలో చేతులెత్తేశాయి. ప్రస్తుతం సిరియా రెబల్స్ చేతుల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ సంబంధాలు మెరుగుపరుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు ముందు ముందు ఎలా ఉంటాయో చూడాలి.
ఇది కూడా చదవండి: 2024 Political Rewind: ఈ ఏడాది ఎన్నికల్లో కొత్తగా గెలిచిన ప్రముఖులు వీళ్లే!