Site icon NTV Telugu

Mecca: మక్కా మసీదులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. రక్షించిన వీడియో వైరల్..

Mecca's Grand Mosque.

Mecca's Grand Mosque.

Mecca: ముస్లింల పవిత్రస్థలం సౌదీ అరేబియాలోని మక్కాలో ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడేందుకు ప్రయత్నించిన సంఘటన వైరల్‌గా మారింది. మక్కాలోని మసీదు అల్-హరామ్‌లో ఈ ఘటన జరిగింది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న వ్యక్తిని అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది అడ్డుకుంది. పై అంతస్తు నుంచి దూకేందుకు ప్రయత్నించిన వ్యక్తిని కింద ఉన్న భద్రతా సిబ్బందిలో ఒకరు రక్షించారు. ఈ సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

Read Also: Tata Motors: టాటా నుంచి కొత్తగా 5 ఎలక్ట్రిక్ కార్లు..

గ్రాండ్ మసీదు భద్రతను పర్యవేక్షించే ప్రత్యేక దళం, వ్యక్తి పైఅంతస్తు నుంచి దూకడానికి ప్రయత్నించిన వెంటనే అలర్ట్ అయింది. గాయపడిన అధికారికి పలు ప్రాక్చర్స్ అయ్యాయని, నిబంధనలకు అనుగుణంగా, అన్ని చట్టపరమైన చర్యలు పూర్తి చేశామని అక్కడి అధికారులు తెలిపారు. ఈ సంఘటననున హరామ్ భద్రతా దళాలు కూడా ధ్రువీకరించాయి. ‘‘గ్రాండ్ మసీదు పై అంతస్తుల నుండి ఒక వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన జరిగింది. అతను నేలపై పడకుండా నిరోధించే ప్రయత్నంలో ఒక భద్రతా అధికారి గాయపడ్డారు’’ అని పేర్కొంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి, భక్తుల్ని రక్షించడానికి ప్రత్యేక భద్రతా దళం వేగంగా పనిచేసిందని సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ ఘటన తర్వాత గ్రాండ్ మసీదు చీఫ్ ఇమామ్ అబ్దుల్ రెహమాన్ అస్ సుడైస్ మాట్లాడుతూ.. పవిత్ర మసీదు పవిత్రతనను భక్తులు గౌరవించాలని, దాని నియమాలను పాటించాలని, ఆరాధనపై దృఫ్టి పెట్టాలని యాత్రికులకు పిలుపునిచ్చింది. ప్రాణాలను రక్షించడం ఇస్లామిక్ బోధనల ప్రధానాంశమని, మీ సొంత చేష్టలతో మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవద్దు అని అన్నారు.

Exit mobile version