Mecca: ముస్లింల పవిత్రస్థలం సౌదీ అరేబియాలోని మక్కాలో ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడేందుకు ప్రయత్నించిన సంఘటన వైరల్‌గా మారింది. మక్కాలోని మసీదు అల్-హరామ్‌లో ఈ ఘటన జరిగింది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న వ్యక్తిని అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది అడ్డుకుంది. పై అంతస్తు నుంచి దూకేందుకు ప్రయత్నించిన వ్యక్తిని కింద ఉన్న భద్రతా సిబ్బందిలో ఒకరు రక్షించారు. ఈ సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.