Makkah: మక్కా మసీదులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. రక్షించిన వీడియో వైరల్..
- పవిత్ర మక్కా మసీదులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం..
- రక్షించిన హరామ్ సెక్యూరిటీ సిబ్బంది..
- ఘటకు సంబంధించిన వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Makkah: ముస్లింల పవిత్రస్థలం సౌదీ అరేబియాలోని మక్కాలో ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడేందుకు ప్రయత్నించిన సంఘటన వైరల్‌గా మారింది. మక్కాలోని మసీదు అల్-హరామ్‌లో ఈ ఘటన జరిగింది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న వ్యక్తిని అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది అడ్డుకుంది. పై అంతస్తు నుంచి దూకేందుకు ప్రయత్నించిన వ్యక్తిని కింద ఉన్న భద్రతా సిబ్బందిలో ఒకరు రక్షించారు. ఈ సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
Read Also: Tata Motors: టాటా నుంచి కొత్తగా 5 ఎలక్ట్రిక్ కార్లు..
Also Read
గ్రాండ్ మసీదు భద్రతను పర్యవేక్షించే ప్రత్యేక దళం, వ్యక్తి పైఅంతస్తు నుంచి దూకడానికి ప్రయత్నించిన వెంటనే అలర్ట్ అయింది. గాయపడిన అధికారికి పలు ప్రాక్చర్స్ అయ్యాయని, నిబంధనలకు అనుగుణంగా, అన్ని చట్టపరమైన చర్యలు పూర్తి చేశామని అక్కడి అధికారులు తెలిపారు. ఈ సంఘటననున హరామ్ భద్రతా దళాలు కూడా ధ్రువీకరించాయి. ‘‘గ్రాండ్ మసీదు పై అంతస్తుల నుండి ఒక వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన జరిగింది. అతను నేలపై పడకుండా నిరోధించే ప్రయత్నంలో ఒక భద్రతా అధికారి గాయపడ్డారు’’ అని పేర్కొంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి, భక్తుల్ని రక్షించడానికి ప్రత్యేక భద్రతా దళం వేగంగా పనిచేసిందని సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ ఘటన తర్వాత గ్రాండ్ మసీదు చీఫ్ ఇమామ్ అబ్దుల్ రెహమాన్ అస్ సుడైస్ మాట్లాడుతూ.. పవిత్ర మసీదు పవిత్రతనను భక్తులు గౌరవించాలని, దాని నియమాలను పాటించాలని, ఆరాధనపై దృఫ్టి పెట్టాలని యాత్రికులకు పిలుపునిచ్చింది. ప్రాణాలను రక్షించడం ఇస్లామిక్ బోధనల ప్రధానాంశమని, మీ సొంత చేష్టలతో మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవద్దు అని అన్నారు.
🕋🚨 A security guard at the Masjid al-Haram rushed to intervene after a person tried to take their own life by jumping off the upper floors of the masjid.
The security guard was injured while trying to prevent the person from hitting the ground. Both individuals were… pic.twitter.com/NnpveIE8wf
— • (@Alhamdhulillaah) December 25, 2025
తాజావార్తలు
-
Telangana 22A Lands: 22A భూములకు గ్రీన్ సిగ్నల్.. ఇక వాటికి రిజిస్ట్రేషన్లు.!
-
The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. ‘ది పారడైజ్’ బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
-
Asian Games 2026: 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. 10,000 మీటర్ల రేసులో భారత్‌కు కాంస్య పతకం
-
Mushtaq Khan: ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత.. 200లకు పైగా సినిమాలు.. హాస్య నటుడిగా చెరగని ముద్ర..
-
BJP: రాహుల్ గాంధీకి అవగాహన లేదు..‘‘ఓట్ చోరీ’’పై బీజేపీ స్ట్రాంట్ కౌంటర్..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!