Site icon NTV Telugu

Pakistan: పాక్‌ మిలిటరీ ప్రధాన కార్యాలయంపై ఆత్మాహుతి దాడి.. ముగ్గురు మృతి

Suicide Attack

Suicide Attack

బాంబు దాడులతో పాకిస్థాన్ దద్దరిల్లింది. సోమవారం తెల్లవారుజామున పెషావర్‌లోని పాకిస్థాన్ పారామిలిటరీ దళ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. రెండు పేలుళ్ల తర్వాత ఫ్రాంటియర్ కార్ప్స్ ప్రధాన కార్యాలయంపై ఆత్మాహుతి దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. పారా మిలిటరీ ప్రధాన కార్యాలయం గేట్ దగ్గర ఆత్మాహుతి దాడి జరిగినట్లుగా సమాచారం. ఒక ఆత్మాహుతి బాంబర్ తనను తాను కాల్చుకున్నట్లుగా వర్గాలు చెబుతున్నాయి. పేలుడు తర్వాత భారీ శబ్దం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఉగ్రవాదులిద్దరూ హతమయ్యారని.. ప్రస్తుతం భద్రతా దళాలు చుట్టుముట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Maoists: 3 రాష్ట్రాల సీఎంలకు మావోల లేఖ.. సారాంశం ఇదే!

ఈ ఏడాది ప్రారంభంలో కూడా ఇదే తరహాలో ఆత్మాహుతి దాడి జరిగింది. అప్పుడు 10 మంది చనిపోయారు. శక్తివంతమైన బాంబ్ కారణంగా అనేక మంది గాయపడ్డారు. ఇక నవంబర్ 11న ఇస్లామాబాద్‌లోని జిల్లా కోర్టు వెలుపల పోలీసు వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 12 మంది మరణించగా.. 27 మంది గాయపడ్డారు. ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దాడికి తామే బాధ్యులమని తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ ప్రకటించుకుంది. అయితే తాజా దాడిపై ఎవరూ బాధ్యత వహించలేదు.

ఇది కూడా చదవండి: Usha Vance: పెళ్లి ఉంగరం లేకుండా ఈవెంట్‌కు హాజరైన ఉషా వాన్స్.. రేకెత్తుతున్న కొత్త పుకార్లు!

 

Exit mobile version