Srilanka: ఆ నలుగురు.. అలా ముంచేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చారిత్రకంగా చూస్తే శ్రీలంక పేరు ప్రస్తావన రామాయణం, మహాభారతంలలోనూ ఉంది. అయితే ప్రస్తుతం ఆ దేశం పరిస్థితికి కారణం ఎవరని పరిశీలిస్తే మహాభారతంలో పేర్కొన్న దుష్ట చతుష్టయం లాంటి ‘ఆ నలుగురు’ కనిపిస్తారు. ఏపీలో నిన్నే ముగిసిన వైఎస్సార్సీపీ ప్లీనరీలో కూడా దుష్టచతుష్టయం అనే అంశంపై నేతలు విరివిగా ప్రసంగించటం గమనార్హం. అదే సమయంలో అటు శ్రీలంక ప్రజలు తమ దేశ అధ్యక్షుడి నివాసాన్ని ఆక్రమించారు. అయితే అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అప్పటికే పరారయ్యారు. పాలకుడంటే ప్రజలను కాపాడేవాడై ఉండాలి. పారిపోయేంత పిరికివాడు కాకూడదు.
రష్యా భీకర యుద్ధాన్ని గుండె ధైర్యంతో ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని చూస్తే తెలుస్తుంది. దేశ అధ్యక్షుడంటే ఎలా ఉండాలో. కానీ గొటబాయ పరారీ వార్తలు వింటే నవ్వొస్తుంది. ఈ పరిణామంతో మొత్తం శ్రీలంక పరువుపోయింది. నవ్వులపాలైంది. భారతంలో శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు చెడ్డ పనులు చేసేవారు కాబట్టి ఆ నలుగురిని దుష్ట చతుష్టయం అనేవారు. శ్రీలంకలో అయితే రాజపక్స సోదరులను ఇలా అభివర్ణించొచ్చు. రాజపక్స సోదరులు మొత్తం నలుగురు.. 1. చమల్ 2. మహింద 3. గొటబాయి 4. బసిల్.
Also Read
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
వీళ్లు శ్రీలంకను 20 ఏళ్లుగా ఇష్టారీతిన పాలించటంవల్లే ఇవాళ ఆ దేశానికి ఈ దుస్థితి వచ్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నలుగురిలో ఒకరు దేశ అధ్యక్షుడిగా, మరొకరు ప్రధానమంత్రిగా, ఇంకో ఇద్దరు మంత్రులుగా, వాళ్ల కొడుకులిద్దరు సైతం మినిస్టర్లుగా, మరో వ్యక్తి ప్రధాని స్టాఫ్‌కి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. కాబట్టి ప్రభుత్వంలో చీమ చిటుక్కుమన్నా వాళ్లకు తెలియకుండా ఉండేది కాదు. ముఖ్య శాఖలన్నీ ఆ కుటుంబం గుప్పట్లోనే ఉండేవి. కుటుంబ పాలన కారణంగా కుంభకోణాలు బయటికి వచ్చేవి కాదు. దేశ సంపద విదేశాలకు తరలినా మూడో కంటోడికి తెలిసేది కాదు.
ఎవరైనా ‘ఇదేంటి’ అని అడిగితే పాపం. అడ్రస్ లేకుండా చేసేవారు. సైన్యం సైతం ఈ సోదరుల చెప్పుచేతల్లోనే ఉండేది. దీంతో రాజపక్స బ్రదర్స్ అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. తమ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరగకుండా ఉండేందుకు ఉచిత పథకాలు ప్రవేశపెట్టారు. ఇబ్బడిముబ్బడిగా డబ్బు పంచారు. ఆర్థిక వ్యవస్థపై పట్టుతప్పింది. సాగుపై ముందుచూపు లోపించింది. ఎరువుల దిగుమతిని నిలిపేయటంతో వ్యవసాయ దిగుబడులు తగ్గి ఆహార కొరత ఏర్పడింది. దీనికితోడు చైనాతో ఫ్రెండ్‌షిప్, కరోనా వంటివి తీవ్ర ప్రభావం చూపాయి. ఒక్కో రంగం కుదేలవటం ప్రారంభించింది.
పాలకులు అభివృద్ధి కార్యక్రమాల పైన కాకుండా అప్పుల పైన ఆధారపడ్డారు. వాటిని తిరిగి చెల్లించలేక చేతులెత్తేశారు. రూపాయి విలువ దారుణాతిదారుణంగా పడిపోయింది. ఒక్క డాలర్ కొనాలంటే ఏకంగా 363 రూపాయలు చెల్లించాల్సిన దుస్థితి దాపురించింది. ఈ నేపథ్యంలో జనం తిరగబడటంతో ఆ నలుగురు అన్నదమ్ములు కనిపించకుండా పోవటం, పదవులకు రాజీనామా చేయటం వంటి నాటకాలకు తెర తీశారు. అతి తక్కువ(2.2 కోట్ల మంది) జనాభా ఉన్న ఈ అందమైన దేశం ఇవాళ రోడ్డున పడింది. ఆ నలుగురు శ్రీలంకను అలా ముంచేశారు. ఒడ్డున పడటానికి ఎన్నేళ్లు పడుతుందో కాలమే సమాధానం చెప్పాలి.
తాజావార్తలు
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
-
SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
-
Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? ‘ప్యారడైజ్’ బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!