Site icon NTV Telugu

Srilanka Economic Crisis: ఉద్రిక్త పరిస్థితులు.. అత్యవసర సమావేశాని ప్రధాని పిలుపు

Srilanka

Srilanka

శ్రీలంకలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, ఇంధన, ఆహార సంక్షోభాలతో  ఇక్కట్లు పడుతున్న శ్రీలంకలో మరోసారి నిరసనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అధ్యక్షుడు గోటబయ రాజపక్స అధికారిక భవనాన్ని ముట్టడించారు ఆందోళనకారులు. భద్రతాబలగాలు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకువచ్చారు నిరసనకారులు. దీంతో అధ్యక్షుడు గోటబయ రాజపక్సను సురక్షిత ప్రాంతానికి తరలించింది శ్రీలంకన్ ఆర్మీ. ఇదిలా ఉంటే రాజపక్స పార్టీకి చెందిన 16 మంది ఎంపీలు వెంటనే అధ్యక్ష పదవికి గోటబయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

తొలిసారిగా చాలా మంది మిలిటరీ సంబంధిత వ్యక్తులు ఆందోళనకారులతో జతకలిశారు. వీరంతా అధ్యక్షుడు గోటబయ రాజపక్సకు వ్యతిరేకంగా ఆయన నివాసం వద్ద ఆందోళన చేశారు.  ఆందోళకారులు అధ్యక్ష భవనంలోకి చొరబడి, స్మిమ్మింగ్ పూల్ ఈత కొట్టడం, కిచెన్ లో వంట చేసుకోవడం వంటివి వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా నిరసనకారులు కొలంబో చేరుకోవడానకి ప్రయత్నిస్తున్నారు. కొలంబోకు రైళ్లు నడపాలని ఆందోళకారులు రైల్వేపై ఒత్తడి తీసుకువస్తున్నారు.

Read Also: Uttarpradesh: రోడ్డు పక్కన కూర్చున్న వారిపై నుంచి దూసుకెళ్లిన వాహనం.. 6గురు మృతి

ఇదిలా ఉంటే ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని రణిల్ విక్రమసింఘే అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చాడు. అధికారిక, ప్రతిపక్ష పార్టీల నేతలంతా రావాలని కోరారు. శ్రీలంకలో దిగజారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సమావేశం కీలకంగా మారనుంది. సమ్యస్య పరిష్కారానికి ప్రతిపక్ష నేతలంతా సహకరించాలని ప్రధాని విక్రమసింఘే కోరుతున్నారు.

తీవ్ర ఆహార, ఇంధన సంక్షోభంతో శ్రీలంక ఇబ్బందులు పడుతోంది. విదేశాల నుంచి వచ్చే ఇంధనానికి కూడా డబ్బులు చెల్లించలేని పరిస్థితికి దిగజారింది. దేశంలో విదేశీమారక నిల్వలు పూర్తిగా అడుగంటుకుపోయాయి. దీంతో శ్రీలంకలో పెట్రోల్ బంకుల మందు రోజుల తరబడి నిలుచున్నా.. లీటర్ పెట్రోల్ దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రజల్లో తీవ్ర అసహనం ఏర్పడింది. ఇది ఆందోళనకు, హింసాత్మక ఘటనలకు దారి తీసింది. 1948లో బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్య్రం పొందిన తర్వాత ఇలాంటి సంక్షోభాన్ని శ్రీలంక ఎప్పుడు ఎదుర్కోలేదు.

 

 

 

 

Exit mobile version