Site icon NTV Telugu

Srilanka Economic Crisis: ప్రధాని ఇంటికి నిప్పు.. శ్రీలంకలో ఉద్రిక్త పరిస్థితులు

Ranil Wickreme Singhe

Ranil Wickreme Singhe

ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు చేజారిపోతున్నాయి. వేలాదిగా నిరసనకారులు కొలంబోలో నిరసనలు, ఆందోళ కార్యక్రమాలు చేపడుతున్నారు. శనివారం దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళను చేపట్టారు. పరిస్థితులు కట్టుతప్పే ప్రమాదం ఉండటంతో అధ్యక్షుడు గోటబయ రాజపక్స తన అధికార నివాసాన్ని వదిలి పారిపోయారు. శ్రీలంకన్ ఆర్మీ అధ్యక్షుడిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో అధ్యక్ష భవనంతో పాటు, ఆయన పరిపాలన భవనాన్ని ఆందోళనకారులు ఆక్రమించారు. ఆందోళనకారుల్ని అదుపు చేయడంతో ఆర్మీ, పోలీసులు కూడా చేతులెత్తేశారు.

ఇదిలా ఉంటే శనివారం ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రధాని రణిల్ విక్రమ సింఘే ఇంటికి నిప్పుపెట్టారు ఆందోళనకారులు. కొద్ది గంటల క్రితం గోటబయ రాజపక్స రాజీనమా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధానికి చెందిన వాహనాలను ధ్వంసం చేశారు. ప్రధాని రణిల్ విక్రమసింఘే వ్యక్తిగత నివాసంలోకి చొరబడిన ఆందోళకారులు నిప్పంటించారని లంక ప్రధాని కార్యాలయం తెలిపింది.

Read Also: Etela Rajender : గజ్వేల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన.. అక్కడి నుండే పోటీ చేస్తా..

ఇదిలా ఉంటే తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు రణిల్ విక్రమసింఘే. ఈ రోజు శ్రీలంకలోని అధికార, విపక్ష పార్టీలతో ఆయన తాజా పరిస్థితుల గురించి చర్చించారు. అఖిల పక్షం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆయన రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ద్వీపదేశంలో గత మార్చి నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. అధ్యక్షుడితో గోటబయతో పాటు అప్పటి ప్రధాని మహిందా రాజపక్సలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. ఆందోళనలకు తలొగ్గి మహిందా రాజపక్స తన ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానంలో రణిల్ విక్రమ సింఘే మే 12న అధికారం చేపట్టారు. తాజాగా జరుగుతున్న ఆందోళనతో ఆయన కూడా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

2.2 కోట్ల జనాభా ఉన్న శ్రీలంక చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిత్యావసరాలు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. పెట్రోల్, డిజిల్ కోసం రోజుల తరబడి బంకుల ముందు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. ఇంధనం, ఆహారం, ఔషధాలు కొందామన్నా.. శ్రీలంక ఖజానాలో విదేశీమారక నిల్వలు లేవు. దీంతో ఏడు దశాబ్ధాల కాలంలో శ్రీలంక అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడింది.

Exit mobile version