NTV Telugu Site icon

Sperm Donor: ఈ వైద్యుడికి 550 మంది సంతానం..! కోర్టుకెక్కిన మహిళ

Sperm Donor

Sperm Donor

Sperm Donor: ఒకరు ముద్దు, ఇద్దరు వద్దు.. మహా అయితే ముగ్గురు చాలు అనే తరహాలో సంతానం ఉండేలా చూసుకుంటున్నారు.. కొందరు ప్రత్యేక పరిస్థితుల్లో కొడుకు కోసం ఎదురుచూస్తూ.. ఎక్కువ మంది ఆడపిల్లలను కన్నవారు కూడా లేకపోలేదు.. ఇక, గతంలో కొన్ని కుటుంబాల్లో 10 మందికి పైగా పిల్లలను కన్నవారు కూడా ఉన్నారు.. అయితే, ఓ వైద్యుడు ఏకంగా 550 మందికి తండ్రి అయ్యాడట.. ఏంటి..? వైద్యుడు ఏంటి? 550 మందికి తండ్రి కావడం ఏంటి..? అనుమానం వెంటనే రావొచ్చు.. అయితే, అతడు 550 మందికి తండ్రి అయ్యింది వీర్యదానం చేయడం ద్వారా..! ఇదే అతడికి ఇప్పుడు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది.. ఎందుకంటే.. ఓ మహిళ ఆ వైద్యుడిపై కోర్టుకెక్కింది.. దీంతో.. ఈ వ్యవహారం చర్చగా మారింది..

Read Also: Lover Suicide: ప్రియుడి ఆత్మహత్య.. మనస్థాపంతో ఒంటికి నిప్పంటించుకుని..

నెదర్లాండ్స్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ది హేగ్‌ నగరంలో జొనథన్‌ ఎం అనే వైద్యుడు నివాసం ఉంటున్నాడు.. ఆయన వయస్సు 41 ఏళ్లు.. ఇప్పటి వరకు నెదర్లాండ్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 13 క్లినిక్‌లలో వీర్యదానం చేశాడట.. అలా ఇప్పటికే 550 మంది చిన్నారులకు తండ్రి అయ్యాడు.. అక్కడే పెద్ద చిక్కు వచ్చిపడింది.. ఎందుకంటే రూల్స్‌ ప్రకారం ఒక వ్యక్తి 12 కుటుంబాలకు మాత్రమే వీర్యదానం చేయాల్సి ఉంటుంది.. కానీ, జొనథన్‌ వీర్యదానం చేసి వంద మందికి పైగా చిన్నారులకు జన్మనిచ్చాడని 2017లోనే తేలింది.. దీంతో అలెర్ట్‌ అయ్యింది ఆ దేశ యంత్రాంగం. ఆ వైద్యుడిని ది డచ్‌ సొసైటీ ఆఫ్‌ అబ్ట్సెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ (ఎన్‌వీఓజీ) బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది.

Read Also: Hyderabad: నేడు టీడీపీ ఆవిర్భావ సభ.. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం

అయితే, నెదర్లాండ్స్ లో వీర్యదానం ద్వారా 25 మంది కంటే ఎక్కువ మంది పిల్లలకు తండ్రి కాకూడదని మరో నిబంధన ఉన్నట్టు తెలుస్తోంది.. అలాగే అనుమి ఇస్తే అది అక్రమ సంబంధాలకు దారి తీసే ప్రమాదం ఉందంటున్నారు.. అయితే, సదరు వైద్యుడు ఇప్పుడు కెన్యాలో నివసిస్తున్నట్టు కొన్ని మీడియా కథనాలు చెబుతున్నాయి.. 2021లో ది న్యూయార్క్ టైమ్స్ పరిశోధనాత్మక కథనం అతను డెన్మార్క్ మరియు ఉక్రెయిన్‌తో సహా విదేశాలలో తన స్పెర్మ్‌ను దానం చేయడం కొనసాగించాడు. దాదాపు 550 మంది పిల్లలకు తండ్రయ్యారని, ఇది 25 కంటే ఎక్కువ పిల్లలకు తండ్రవడం లేదా 12 మంది కంటే ఎక్కువ మంది తల్లులను గర్భం దాల్చడం వంటి డచ్ మార్గదర్శకాలను విరుద్ధం అంటున్నారు.. “సంతానోత్పత్తి” మరియు అశ్లీలతను నివారించడానికి ఈ విధమైన మార్గదర్శకాలు ఉన్నాయి. వందలాది మంది తోబుట్టువులను కలిగి ఉన్న పిల్లలపై మానసిక ప్రభావం కూడా ఉందని ఓ అధ్యయనం పేర్కొంది.. కానీ, బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టిన తర్వాత ఇలా 550 మంది తండ్రి కావడం మాత్రం అతడిని చిక్కుల్లో నెట్టింది.