NTV Telugu Site icon

Isreal-Hamas War: తోటి ప్రజాప్రతినిధి వ్యాఖ్యలపై సెన్సార్.. అమెరికా ప్రతినిధుల సభలో కీలక పరిణామం..

Isreal Hamas War

Isreal Hamas War

Isreal-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా విభజన తీసుకువచ్చింది. కొన్ని దేశాలు ఇజ్రాయిల్‌కి మద్దతు తెలుపుతుండగా.. మరికొన్ని దేశాలు పాలస్తీనా, హమాస్ మిలిటెంట్లకు మద్దతు ఇస్తున్నారు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా ఇజ్రాయిల్‌కి సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఇదిలా ఉంటే యూఎస్ ప్రతినిధుల సభలో పార్టీల మధ్య ఈ అంశం చీలిక తీసుకువచ్చింది. అమెరికా ప్రతినిధుల సభలో ఏకైక పాలస్తీనియన్- అమెరికన్ అయిన రషీదా త్లైబ్ చేసిన వ్యాఖ్యలపై సభ సెన్సార్ విధించింది. ఆమె వ్యాఖ్యల్ని సభ ఖండించింది. అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌‌పై హమాస్ దాడిని సమర్థించిందని, ఇజ్రాయిల్ని నాశనం చేయాలని పిలుపునిచ్చిందనే ఆరోపణలు కూడా ఈమెపై ఉన్నాయి.

‘‘నది నుంచి సముద్రం వరకు’’ అనే పదం వాడారని, ఇజ్రాయిల్ ని నిర్మూలించే విధంగా దీన్ని వాడారంటూ తోటి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె ప్రసంగాన్ని సెన్సార్ చేసేందుకు సభలో ఓటింగ్ నిర్వహించారు. 234-188 మెజారిటీతో దీనికి ఆమోదం లభించింది. ముఖ్యంగా ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ సభ్యులు దీనికి పూర్తి మద్దతు తెలుపగా.. అధికార డెమోక్రటిక్ పార్టీలోని కేవలం 22 మంది సభ్యులు మాత్రమే తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. రషీదా తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నట్లు రిపబ్లికన్లు ఆరోపించారు.
ఇదే కాకుండా రషీదా ‘‘ఇంటిఫాదా’’ అనే పదాన్ని ఉపయోగించినట్లు తీర్మానం హైలెట్ చేసింది. దీని అర్థం ‘‘తిరుగుబాటు’’. యూదులకు వ్యతిరేకంగా యాంటీసెమిటిక్‌గా ఆమె వ్యవహరిస్తోందని ఆరోపించారు.

Read Also: Japan: టచింగ్.. టచింగ్ వీడియో సాంగ్.. యూట్యూబ్ లో కుమ్మేస్తోంది

అయితే తాను పాలస్తీనా హక్కుల కోసం నిలబడ్డానని ఆమె తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు. ప్రతినిధుల సభ తన తన గొంతును నొక్కేస్తుందని ఆమె ఆరోపించారు. భావోద్వేగానికి లోనైన రషీదా.. సంక్షోభంలో చిక్కుకున్న పాలస్తీనా, ఇజ్రాయిల్ పిల్లల విషయంలో తనకు ఎలాంటి భేదం లేదని వివరణ ఇచ్చారు. తాను ఇజ్రాయిల్ ప్రభుత్వ విధానానినికి మాత్రమే వ్యతిరేకమని, అక్కడి ప్రజలు కాదని చెూప్పారు. మీరు నా మాటల్ని సెన్సార్ చేయగలరు.. కానీ వారి గళాలను మూయించలేదరని ఆమె వ్యాఖ్యానించారు.

రిపబ్లికన్ ప్రతినిధి రిచర్డ్ మెక్‌కార్మిక్ ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘అమెరికా గొప్ప మిత్రదేశమైన ఇజ్రాయిల్‌పై అక్టోబర్ 7 నాటి దాడి గురించి నమ్మశక్యం కాని అబద్ధాలను ఆరోపించారు’’ అని అన్నారు. ఇది ఇజ్రాయిల్ నాశనానికి, యూదుల హత్యకు పిలుపునివ్వడం తప్ప మరేమీ కాదని యూదు డెమెక్రాట్ సభ్యుడు చెప్పారు.