Isreal-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా విభజన తీసుకువచ్చింది. కొన్ని దేశాలు ఇజ్రాయిల్‌కి మద్దతు తెలుపుతుండగా.. మరికొన్ని దేశాలు పాలస్తీనా, హమాస్ మిలిటెంట్లకు మద్దతు ఇస్తున్నారు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా ఇజ్రాయిల్‌కి సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఇదిలా ఉంటే యూఎస్ ప్రతినిధుల సభలో పార్టీల మధ్య ఈ అంశం చీలిక తీసుకువచ్చింది. అమెరికా ప్రతినిధుల సభలో ఏకైక పాలస్తీనియన్- అమెరికన్ అయిన రషీదా త్లైబ్ చేసిన వ్యాఖ్యలపై సభ సెన్సార్ విధించింది. ఆమె వ్యాఖ్యల్ని సభ ఖండించింది.…