Canada: హర్దీప్ సింగ్ నిజ్జర్ సహాయకుడి ఇంటిపై దాడులు.. కెనడాలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada: కెనడా మరోసారి ఉలిక్కిపడింది. ఆ దేశం ఇప్పటికే భారత వ్యతిరేకత, ఖలిస్తానీలకు అడ్డాగా మారింది. గతేడాది ఖలిస్తానీ ఉగ్రవాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ని కెనడాలోని సర్రే నగరంలోని గురుద్వారా ముందర గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన ఇరు దేశాల మధ్య దౌత్యవివాదానికి కారణమైంది. ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో వివాదం మొదలైంది. మరోవైపు భారత్, ఇది కెనడా రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలని, ఉగ్రవాదులకు అడ్డగా మారిందని ఘాటుగానే విమర్శించింది.
Read Also: Hemant Soren: మాజీ సీఎం హేమంత్ సొరెన్‌కి 5 రోజుల ఈడీ కస్టడీ..
Also Read
ఇదిలా ఉంటే, తాజాగా నిజ్జర్ సన్నిహితుడు, సర్రేలో నివాసం ఉంటున్న సిమ్రంజీత్ సింగ్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు రాత్రిపూట కాల్పులు జరిపారు. ఈ ఘటనపై రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (RCMP) దర్యాప్తు ప్రారంభించినట్లు కెనడాకు చెందిన మీడియా నివేదించింది. గురువారం తెల్లవారుజామున 1:20 గంటల తర్వాత తుపాకీ కాల్పుల ఘటనపై స్పందించినట్లు పోలీసులు వెల్లడించారు. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించడంతో పాటు స్థానికులను అక్కడి పోలీసులు విచారిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం అతని ఇంటిపై బుల్లెట్ రంధ్రాలు, కాల్పుల్లో దెబ్బతిన్న కారు కనిపించింది. అయితే, దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని, దీనికి ఎవరు కారణమనేది నిర్ధారించబడలేదని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి.
తాజావార్తలు
-
Madhya Pradesh: ప్రచారంలో నరోత్తమ్ మిశ్రా కన్నీళ్లు.. దతియాలో కాంగ్రెస్ విజయానికి కారణం ఏంటి..?
-
Prashant Kishor: బీహారీయులు సామ్రాట్ చౌదరి నాయకత్వాన్ని తిరస్కరించారు.. గెలుపు తర్వాత ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
-
Prashant Kishor: బీహార్ అసెంబ్లీలో ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ.. ప్రభుత్వానికి, ఆర్జేడీకి కొత్త తలనొప్పి..!
-
Mrunal Thakur: ఫ్రెండ్ రిసెప్షన్లో స్టార్ హీరోయిన్ రచ్చ! నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ డ్యాన్స్ వీడియో..
-
Bypoll Elections: అభ్యర్థుల మార్పే ముంచేసిందా..? బీజేపీ వ్యూహం ఎక్కడ తిరగబడింది..?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!